YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విమానం తమ గగనతలంలో ఎగిరేందుకు నో చెప్పిన పాక్

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విమానం తమ గగనతలంలో ఎగిరేందుకు నో చెప్పిన పాక్

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐస్‌లాండ్ పర్యటన సందర్భంగా పాక్ గగనతలంకు రాష్ట్రపతి విమానం ఎగిరేందుకు అనుమతి ఇవ్వాలని భారత్ చేసుకున్న దరఖాస్తును తిరస్కరించినట్లు పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ శనివారం చెప్పారు. సోమవారం నుంచి రాష్ట్రపతి ఐస్‌లాండ్, స్విట్జర్లాండ్, స్లోవేనియా పర్యటన కోసం వెళుతున్నారు. ఈ పర్యటనల్లో ఆయన ఆయా దేశాధినేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆయన పుల్వామా దాడుల తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై వారితో చర్చించనున్నారు.

రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్‌ విమానంకు తమ గగనతలంలో ఎగిరేందుకు భారత్ చేసుకున్న దరఖాస్తును ఇమ్రాన్‌ఖాన్ తిరస్కరించారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మెహమూద్ ఖురేషీ తెలిపారు. ఇప్పటికే భారత్ పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పాక్ నుంచి వచ్చిన ఈ సమాధానంతో భారత్ ఆగ్రహంతో ఉంది. ఇదిలా ఉంటే బాలాకోట్ దాడుల తర్వాత పాకిస్తాన్ తమ గగనతలంను భారత విమానాలకు పూర్తిగా మూసివేసింది. అయితే జూలై 16న తిరిగి తెరిచినప్పటికీ ఆ తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో మళ్లీ పాక్ ఆంక్షలు విధించింది. దీంతో ఇప్పటికే భారత్ నుంచి పాశ్చాత్య దేశాలకు వెళ్లాల్సిన విమానాలు తమ సర్వీసులను రద్దు చేశాయి.

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడంతో భారత్‌పై పీకల్లోతు ఆగ్రహం పెంచుకుంది పాకిస్తాన్. ఇక అప్పటి నుంచి ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా భారత్‌ను అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడింది. ఈ క్రమంలోనే పిచ్చిప్రేలాపనలకు పోతోంది పాకిస్తాన్. కశ్మీర్ సాధనకోసం అవసరమైతే భారత్‌పై అణుయుద్దం చేసేందుకైనా సిద్ధమంటూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పిచ్చి ప్రకటనలు చేశారు. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి భారత్‌కు రైలు సర్వీసులు, బస్సు సర్వీసులు రద్దు అయ్యాయి. అంతేకాదు వాణిజ్య సంబంధాలను కూడా పాక్ వద్దనుకుంది.

Related Posts