YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

సీఎం జగన్ కు పవన్ అల్టిమేటం : టార్గెట్ బొత్సా : కాపు రిజర్వేషన్ల మీద ఇలా..!!

 సీఎం జగన్ కు పవన్ అల్టిమేటం : టార్గెట్ బొత్సా : కాపు రిజర్వేషన్ల మీద ఇలా..!!

ముఖ్యమంత్రి జగన్ కు జనసేన అధినేత పవన్ అల్టిమేటం జారీ చేసారు. రాజధాని అమరావతి నుండి తరలించటానికి వీళ్లేదని..తరలిస్తే సహించమని స్పష్టం చేసారు. తాను రాజధాని అమరావతిలో ఏర్పాటుకు వ్యతిరేకంగా కాదని..బలవంతంగా భూములు సేకరిస్తూ సహించనని మాత్రమే చెప్పానని గుర్తు చేసారు. రాజధాని కోసం ఇప్పటికే 9 వేల కోట్లు పెట్టుబడి పెట్టారని..ఇప్పుడు రాజధాని మార్పు ఎలా చేస్తారని ప్రశ్నిం చారు. ఇక, మంత్రి బొత్సాను జనసేన అధినేత టార్గెట్ చేసారు. బొత్సా మైండ్ గేమ్ ఆడుతున్నారని..రాష్ట్ర విభజన సమయంలోనూ బొత్సా ఇలాగే చేసారని చెప్పుకొచ్చారు. ఆయన ముఖ్యమంత్రిలా మాట్లాడుతు న్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వాలు మారితే రాజధానులు మార్చాలా అని ప్రశ్నించారు. అయితే..రాజధాని తరలింపు గురించి వివాదం సద్దుమణిగి తరలింపు లేదనే సంకేతాలు వస్తున్న సమయంలో మరోసారి పవన్ రాజధాని గురించి ప్రస్తావించారు. అయితే..బొత్సా ను టార్గెట్ చేయటం వెనుక పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే చర్చ మొదలైంది. కాపు రిజర్వేషన్ల మీద పవన్ చేసిన వ్యాఖ్యల పైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

జనసేన అధినేత మరోసారి ముఖ్యమంత్రి అల్టిమేటం ఇచ్చారు. రాజధాని తరలింపు సాధ్యం కాదని..దీని పైన ఆలోచన వద్దని స్పష్టం చేసారు. అమరావతికి తాను వ్యతిరేకం కాదని..బలవంతంగా భూములు సేకరణకు తాను వ్యతిరేకమని తేల్చి చెప్పారు. రాజధాని తరలిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే 9 వేల కోట్లు పెట్టుబడులు పెట్టారని..అదంతా బొత్సా తన ఇంటి నుండి తెచ్చి ఇస్తారా అని ప్రశ్నించారు. రాజధానిలో పనులు సాగుతుంటే ఎలా తరలిస్తారని ఫైర్ అయ్యారు. తాను గతంలో రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా చెబుతున్నారని..ఎప్పుడూ తాను ఆ రకంగా మాట్లాడ లేదని వివరించారు. ప్రభుత్వాలు మారితే రాజధానులు మారాలా అని పవన్ ప్రశ్నించారు. మంత్రి బొత్సా తాను ముఖ్యమంత్రి అనుకొని రాజధాని పైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పవన్ డిమాండ్ చేసారు.

మంత్రి బొత్సాను జనసేనాని టార్గెట్ చేసారు. బొత్సా రాష్ట్ర ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఆయన రాష్ట్రం విడిపోతే తప్పేముందని ప్రకటించి ప్రజలతో మైండ్‌గేమ్‌ ఆడారని, మళ్లీ ఇప్పుడు అమరావతి విషయంలో అదే తరహాలో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణంపై తానెప్పుడూ రెండు మాటలు మాట్లాడలేదన్న విషయాన్ని బొత్స గ్రహించాలన్నారు. హరిత రాజధాని నిర్మాణానికి గత ప్రభుత్వం సుమారు రూ.9 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టి నిర్మాణ పనులను కొనసాగిస్తున్న తరుణంలో రాజధాని మరో ప్రాంతానికి ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తూనే.. ఈ సొమ్మును బొత్స ఇంటి నుంచి తెచ్చిపెడతారా అని ఫైర్ అయ్యారు.బొత్సా ముఖ్యమంత్రి తరహాలో మాట్లాడడం దారుణమని ... ప్రభుత్వాలు మారితే రాజధానులు మార్చాలా అని నిలదీసారు. రాజధాని తరలింపు నిర్ణయం తీసుకుంటే జనసేన బలంగా ఎదుర్కొంటుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. చివరకు అమరావతిని కర్నూలులో జగన్నాథకట్ట నిర్మాణంలా చేస్తారేమోనని వ్యాఖ్యానించారు.

కాపు రిజర్వేషన్ల అంశం మీద పవన్ స్పందించారు. తెలంగాణ..కాశ్మీర్ అంశాలు పరిష్కారం కాగా కాపు రిజర్వేషన్ల అంశం ఎందుకు పరిష్కారం చేసుకోలేమా అని ప్రశ్నించారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలవారికి వారికి ఈబీసీ రిజర్వేషన్లు వర్తింపజేయాలన్న కేంద్రం ఆదేశాలను అమలుచేయడంతోపాటు కాపు వర్గానికి గత ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ల విషయంపై అత్యధిక మెజారిటీతో గెలిచిన వైసీపీ ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం తనకుందని చెప్పారు. బొత్స దీని కోసం ప్రయత్నించాలని సూచించారు. ఒక పార్టీ అధికారంలోకి రాగానే ప్రతిపక్షాలపై సహజంగానే వేధింపుల పర్వం కొనసాగుతుందని.. ఉదాహరణకు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు విషయంలో ఇదే తరహా వేధింపులు కొనసాగాయని పవన్‌ ఆరోపించారు. సుమారు 5 వేల ఆలయాల పూజారులకు ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున జీతాలు చెల్లించాల్సి ఉందన్నారు. వారికి వైద్యపరమైన సేవలందించాలని, వీటితోపాటు ధూప, దీప, నైవేద్యాల కింద చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

Related Posts