యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి సత్తా చాటుతున్నాడు. గతంలో 'బాహుబలి' సిరీస్‌తో వరల్డ్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించి, బాక్సాఫీస్ షేక్ చేసిన ఈ హీరో.. ఇప్పుడూ అందరిచేత 'సాహో' అనిపించుకుంటున్నాడు. ప్రభాస్ హీరోగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సాహో' కలెక్షన్ల సునామీ స్తుష్టిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఆ వివరాలేంటో చూద్దామా..
అతి తక్కువ అనుభవం ఉన్న యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన 'సాహో' చిత్రం తొలుత మిశ్రమ స్పందన తెచ్చుకున్నపటికీ ఆ తర్వాత పుంజుకుంది. అన్ని ఏరియాల్లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తూ తొలివారంలో ఓ రేంజ్ బిజినెస్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 'సాహో' సంచలనంగా మారింది.
విడుదలైన 5 రోజుల్లోనే 350 కోట్ల మార్క్ దాటేసిన సాహో.. ఇప్పుడిప్పుడే కాస్త నెమ్మదించింది. అయినప్పటికీ డీసెంట్ ఫిగర్ నమోదు చేస్తూ ఆకర్షిస్తోంది. మొత్తంగా చూస్తే తొలి వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 370 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది సాహో సినిమా. అంతేకాదు ఈ సినిమా 400 కోట్ల క్లబ్‌లో కూడా చేరిపోయిందనేది తాజా సమాచారం.
తెలుగుతో హిందీ, ఇతర భాషల్లోనూ విడుదలైన సాహో.. బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. తొలుత నెగెటివ్ రివ్యూస్, మిశ్రమ స్పందనతో కాస్త డీలా పడిన ఈ సినిమా అనూహ్యంగా యూ టర్న్ తీసుకొని కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నెగెటివ్ టాక్ వచ్చినా కూడా 'సాహో' కలెక్షన్ల సునామీ, ప్రేక్షకాదరణ చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ ఆశ్చర్యపోతోందట.
బాలీవుడ్‌లో తొలి 8 రోజుల్లో సాహో 120 కోట్ల రూపాయలు రాబట్టింది. మొదటి రోజు 24.40 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు 25.20 కోట్లు, మూడో రోజు 29.48 కోట్లు, నాలుగో రోజు 14.20 కోట్లు, ఐదో రోజు 9.10 కోట్లు, ఆరో రోజు 6.90 కోట్లు, ఏడో రోజు 6.75 కోట్లు, ఎనిమిదో రోజు 4.25 కోట్లు వసూలు చేసింది. దీనికి ఓవర్సీస్ హిందీ వెర్షన్ కెలెక్షన్స్ కలిపితే సాహో 150 కోట్లు రాబట్టిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో ‘సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో సుజిత్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించింది. పలు భాషల్లోని భారీ తారాగణం పాలుపంచుకుంది.