Highlights
- వేసవిలో ఈ కొత్త సినిమా ప్రారంభం
- రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా ఆ చిత్రం
టాలీవుడ్ లో టాప్ హీరోల పక్కన ఛాన్స్ లు కొట్టేస్తోన్న పూజా హెగ్డే తాజాగా బాహుబలి హీరో ప్రభాస్ తో జత కడుతుంది. ప్రభాస్ సాహో తర్వాత జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్‌లోనే కొత్త చిత్రం చేయనున్నారు. ఈ విషయాన్ని కూడా పూజానే ఓ ఇంటర్వూలో వెల్లడించారు. తాను ఆ చిత్రంలో ప్రభాస్ సరసన తాను నటించబోతున్నట్లు పూజ తెలిపింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా ఆ చిత్రం ఉండబోతుందని పూజా పేర్కొన్నారు. వేసవిలో ఈ కొత్త సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా పూజా హెగ్డే ని ఇప్పటికే త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో ఒకే చెప్పారు.