20న గ్రామసచివాలయ ఫలితాలు
ఏపీలో గ్రామ సచివాలయాల్లో 1,26,728 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి 8 వరకు రాతపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 21,69,814 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగా.. 19,74,588 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే రాతపరీక్షల ఫలితాలు సెప్టెంబరు 20న వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.అభ్యర్థుల ఆన్సర్ షీట్లను నాగార్జున యూనివర్సిటీలో స్కానింగ్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 350 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటికే దాదాపు 10 లక్షల వరకు ఆన్సర్ షీట్ల స్కానింగ్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.మరో 10 రోజుల్లో స్కానింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయి. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగే సెప్టెంబరు 20న ఫలితాలను వెల్లడించనున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.