YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ప్రముఖ నటుడు వంకాయల సత్యనారాయణ మృతి!

ప్రముఖ నటుడు వంకాయల సత్యనారాయణ మృతి!

ప్రముఖ తెలుగు సినీ నటుడు వంకాయల సత్యనారాయణ మృతి చెందారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. సత్యనారాయణ వయసు 78 సంవత్సరాలు. వంకాయల సత్యనారాయణ డిసెంబర్ 28, 1940లొ విశాఖపట్నంలో జన్మించిన  వంకాయల సత్యనారాయణ  నటన మీద ఆసక్తితో సినిమా రంగం వైపు వచ్చారు. ఆయన అనేక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు.

నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వంకాయల సత్యనారాయణ కెరీర్లో దాదాపు 180పైగా సినిమాలు, పలు టీవీ సీరియల్స్లో నటించారు.


సినిమాల్లోకి రాక ముందు ఆయన చదువు, స్పోర్ట్స్లో మంచి ప్రతిభ కనబరిచేవారు. బికాంలో గోల్డ్ మెడల్ అందున్నారు. 1960 ఆగస్టులో షూటింగ్ కాంపిటీషన్లో భారతదేశంలోనే మొదటి స్థానం పొందారు.చదువు, ఆటల్లో ఆయన ప్రతిభకు హిందుస్థాన్ షిప్యార్డులో మంచి ఉద్యోగం వచ్చినప్పటికీ ఉద్యోగం కన్నా నటనరంగమే ముఖ్యమని భావించినా సత్యనారాయణ సినిమాల వైపు అడుగులు వేశారు.
'నీడలేని ఆడది' సినిమా ద్వారా వంకాయల సత్యనారాయణ తన సినిమా కెరీర్ ప్రారంభించారు. సూత్రదారులు, సీతా మహాలక్ష్మి, దొంగకోళ్లు, ఊరికి ఇచ్చిన మాట, విజేత, శ్రీనివాస కళ్యాణ్ లాంటి చిత్రాలు వంకాయల సత్యనారాయణకు మంచి పేరు తెచ్చాయి.

Related Posts