అధికార టీఆర్ఎస్ లో అసంతృప్త జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. తాజా కేబినెట్ కూర్పుపై మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే రాజయ్య బాహాటంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణలో 11 నుంచి 12 శాతం మాదిగలున్నారని, కానీ కేబినెట్లో మాత్రం మాదిగలు లేరని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. విలేకరులతో చిట్చాట్గా మాట్లాడుతూ... తెలంగాణలో మాదిగలు, ఏపీలో మాలలున్నారని తెలిపారు. అయితే మాదిగల గురించి ఎవరో ఒకరు మాట్లాడాలని, విపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తారని రాజయ్య అన్నారు.