YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

బడ్జెట్ వాస్తవానికి దూరం : మల్లు భట్టివిక్రమార్క

బడ్జెట్ వాస్తవానికి దూరం : మల్లు భట్టివిక్రమార్క

టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని, అవగాహన లోపం, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఈ బడ్జెట్ లో ఏమీ

లేదని, ప్రభుత్వం చేతులెత్తేసిన బడ్జెట్ లా ఉందని విమర్శించారు. ఆరు నెలల కోసం అవసరం లేకపోయినా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఆ తర్వాత ఆరు నెలల బడ్జెట్ ప్రవేశపెట్టి చేతులు

దులుపుకున్నారని ధ్వజమెత్తారు.
 గత ప్రభుత్వ మిగులు బడ్జెట్ ఫలాలు ఐదేళ్ల వరకూ సాగాయని, ఇప్పుడు ఈ ప్రభుత్వ వాస్తవ ఫలితాలు కనిపిస్తున్నాయని అన్నారు. అందుకే కోతలు పెడుతున్నారని, బడ్జెట్లో నిరుద్యోగ భృతి,

మూడెకరాల ఊసూ లేదని, డబుల్ బెడ్రూం, ఊసు అసలే లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీపాద, ఎల్లంపల్లితో హైదరాబాద్ కు నీళ్లు తెచ్చింది కాంగ్రెస్ అని, కానీ కేసీ ఆర్ గొప్పతనంగా

చెప్పుకుంటున్నారని మల్లు మండిపడ్డారు. కాళేశ్వరం ప్యాకేజీలు కాంగ్రెస్ నిర్మిస్తే, జలకళ అని టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోందని భట్టి విక్రమార్క ఆరోపించారు

Related Posts