YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిబంధనల ప్రకారం చర్యలు

Highlights

  • అసెంబ్లీలో కాంగ్రెస్ దాదాగిరి
  • మద్యం తాగి అసెంబ్లీకి వచ్చారు
  • సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలి 
నిబంధనల ప్రకారం చర్యలు

తెలంగాణ రాష్ట్ర  శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ పై  హెడ్ ఫోన్ ను విసిరిన ఘటనలో నిబంధనల ప్రకారంగా చర్యలు తీసుకొంటామని రాష్ట్ర  శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి తన్నీరు.హరీష్ రావు ప్రకటించారు. గవర్నర్ ప్రసంగం సమయంలో ఏం జరిగిందనే విషయమై అసెంబ్లీ పుటేజీని పరిశీలిస్తున్నామని హరీష్ రావు. విపక్షాల తీరును హరీష్ రావు తప్పుబట్టారు. కాంగ్రెస్ సభ్యులు ఉద్దేశ్యపూర్వకంగానే దాడికి దిగారని హరీష్ రావు చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలను ప్రసంగిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. నిరసన చేస్తున్న క్రమంలోనే నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెడ్ ఫోన్ ను విసరడంతో శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ కంటికి గాయాలయ్యాయి. దాంతో  అయనకు సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్స చేశారు.


అసెంబ్లీలో కాంగ్రెస్ దాదాగిరి
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో దాదాగిరి చేయాలని భావిస్తున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీహర్ అసెంబ్లీ కాదు, తెలంగాణ అసెంబ్లీగా గుర్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ సభ్యులకు శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. అసెంబ్లీలో గొడవ చేసి సస్సెన్షన్కు గురి కావాలని కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడగా ఉందన్నారు. శాసనసమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ పై హెడ్ ఫోన్ విసిరేసిన నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని శాసనమండలిలో టిఆర్ఎస్ విప్ సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
మద్యం తాగి వచ్చారు..
గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఆ పార్టీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించారని టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ సభ్యులు మద్యం తాగి అసెంబ్లీకి వచ్చారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు.ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తూలి జానారెడ్డిమీద పడ్డారని చెప్పారు. దీంతో జానారెడ్డి సభనుండి వెళ్ళిపోయారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు
 

Related Posts