YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ముందు నుయ్యి వెనుక గోయ్యిగా గంటా

ముందు నుయ్యి వెనుక గోయ్యిగా గంటా

ముందు నుయ్యి వెనుక గోయ్యిగా గంటా
విశాఖపట్టణం, విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు రోజులు బాగులేనట్లుగా ఉన్నాయి. ఆయన రామా అంటే బూతుగా వినిపిస్తోంది. తాను సచ్చీలుడని చెప్పుకోవడానికా అన్నట్లుగా గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి జగన్ కి లేఖ రాశారు. సిట్ నివేదిక అయినా బయటపెట్టండి, లేదా కొత్త సిట్ అయినా నియమించి నిజాలు నిగ్గు తేల్చండి అంటూ సవాల్ చేసే తీరుగానే లేఖ రాశారు. అంటే తన తప్పు ఏమీ లేనట్లుగానే గంటా శ్రీనివాసరావు చెప్పుకున్నారని అర్ధమవుతోంది. దీని మీద మండిపోయిన ఆయన నిన్నటి మిత్రుడు, నేటి జిల్లా మంత్రి అయిన అవంతి శ్రీనివాస‌రావు గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి దొడ్డిదారిన వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాని హాట్ కామెంట్స్ చేశారు. గంటా శ్రీనివాసరావు కనుసన్నల్లోనే విశాఖ భూ దందా జరిగిందని, గంటా ఇపుడు అమాయకుడి మాదిరిగా సీఎం కి లేఖ రాయడమేంటని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం కొత్త సిట్ ని వేస్తుందన్న సంగతి తెలిసే గంటా ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పాల్పడుతున్నారని కూడా సెటైర్లు వేశారు.విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రి మోపిదేవి వెంటకరమణ మీడియాతో మాట్లాడుతూ చెప్పిందాని ప్రకారం చూస్తే విశాఖ భూ కుంభకోణాలపైన కొత్త సిట్ ని తొందరలోనే ప్రభుత్వం నియమిస్తుందని తెలుస్తోంది. కొత్త సిట్ వేయాలన్న దాని వెనక మంత్రి అవంతి ఒత్తిడి ఉందని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు చంద్రబాబు, లోకేష్ లకు బినామీ అని ఆరోపిస్తున్న అవంతి అన్ని విషయాలు బయటకు రావాలంటే సిట్ వేయడమే మంచిదని అంటున్నారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుందని, నిజాలు బయటకు తీసి జనాలకు మొత్తం సమాచారం తెలియచేస్తుందని చెప్పుకొస్తున్నారు. దాదాపుగా రెండు వేల కోట్ల విలువ చేసే విశాఖ భూదందా అప్పట్లో సంచలనం రేపింది. ఈ విషయంలో నాటి ప్రభుత్వం నాంచి మొత్తానికి సిట్ పేరిట ఓ విచారణను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తరువాత నివేదిక సైతం బయటపెట్టకుండా మీనమేషాలు లెక్కించి ఎన్నికల ముందు అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేశారని ప్రచారం జరిగింది.గంటా శ్రీనివాసరావు విషయాన్ని ప్రస్తావిస్తూ మంత్రి అవంతి ఈ మధ్య అన్న మాటలు ఒక్కసారి పరిశీలిస్తే తాను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అంత మంచివాణ్ణి కాదు అని పోలిక తెచ్చారు. మరో వైపు అయ్యన్న సైతం అవంతి ప్రస్తావన తెస్తూ అవంతి వైసీపీలో చేరి మంత్రి అవుతారని ఎవరైనా వూహించారా అని చెప్పుకొచ్చారు. విషయమేంటంటే అయ్యన్నకు అయిదేళ్ళ టీడీపీ జమానాలో గంటా శ్రీనివాసరావుతోనే ఎపుడూ పెద్ద గొడవ ఉండేది. ఇద్దరికీ అసలు పడేది కాదు. ఇపుడు అవంతి ఈ విధంగా మాజీ మంత్రి మీద రెచ్చిపోతూంటే తెరవెనక అయ్యన్న సాయం కూడా అందుతోందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం
అవుతున్నాయి. అదే సమయంలో మరో మాజీ మంత్రి, కాంగ్రెస్ లో ఉన్నపుడు గంటా బాధితుడుగా ఉన్న బాలరాజు కూడా తొందరలో వైసీపీలో చేరుతారన్న సమాచారం కూడా ఉంది. దీంతో గంటా శ్రీనివాసరావు మీద ఉమ్మడి దాడికి రంగం సిధ్ధమవుతోందా అన్న చర్చ సాగుతోంది.

Related Posts