ఘనంగా పెద్ద సరిగేసు వేడుకలు
మంత్రాలయం, కులమతాలకు అతీతంగా మోహరం వేడుకలను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మండల పరిధిలోని సూగూరు గ్రామంలో మొహరం పండుగ లో భాగంగా ఆదివారం రాత్రి పెద్ద సరిగేసు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం ప్రజలందరూ కులమతాలకతీతంగా పీర్ల దేవుడి దగ్గరికి వెళ్లి బురుగులు చక్కర టెంకాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ గుంతలో పుల్లలు వేసి భక్తిశ్రద్ధలతో ఆలయ ఆటలు ఆడుకున్నారు. రాత్రంతా యువకులు ఆలయం చుట్టూ సంబరాలతో ఆటలాడుకున్నారు. ఉదయం ఆటలు ఆడుకుంటూ ఒకేరంగు టీషర్టులు వేసుకుని డప్పువాయిద్యాలతో ఆటలాడుకుంటు గృహాలకు చేరుకున్నారు. యువకులంతా ఒకే యూనిఫాంలో బట్టలు వేసుకొని ఆటలు ఆడుతూ ఉంటే చూపరులను ఆకట్టుకున్నారు.