YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పీఆర్సీకి బడ్జెట్లో నిధులు నిల్.  టీ ఉద్యోగ జిల్లా ఐకాస

పీఆర్సీకి బడ్జెట్లో నిధులు నిల్.  టీ ఉద్యోగ జిల్లా ఐకాస

పీఆర్సీకి బడ్జెట్లో నిధులు నిల్. 
టీ ఉద్యోగ జిల్లా ఐకాస
జగిత్యాల సెప్టెంబర్ 10 
ఉద్యోగుల వేతన సవరణ(పీఆర్సీ)కు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయించక పోవడం పట్ల టీ ఉద్యోగ ఐకాస జగిత్యాల జిల్లా శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం జిల్లా టీ ఎన్జీవోల భవన్ లో టీ ఉద్యోగ ఐకాస జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో "పీఆర్సీకి బడ్జెట్లో నిధులు నిల్ " అనే అంశంపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధాన వక్తగా టీ ఉద్యోగ ఐకాస గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్,టీ ఉద్యోగ ఐకాస జిల్లా చైర్మన్ భోగ శశిధర్,కో చైర్మన్ ఎం డీ వకీల్ మాట్లాడారు.బడ్జెట్ వేతన పద్దు కింద కేటాయింపు లు గత సంవత్సరం మాదిరిగానే ఉన్నాయన్నారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో పీ ఆర్సీ ఇవ్వాలంటే ఈ కేటాయింపు లు సరిపోవన్నారు.కనీసం 30 శాతం పెరుగుదల ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.2018 మే లో ప్రభుత్వం వేతన సవరణ కమిటీ వేసి 3 నెలల్లోనే నివేదిక సమర్పించాలని అదేశించి నప్పటికి సంవత్సరం 3నెలలు కావస్తున్నా ఇంత వరకు నివేదిక ఇవ్వడం లేదన్నారు. పీఆర్సీ నివేదిక సత్వరమే సమర్పించాలని ,దాన్ని ప్రభుత్వం అమలు చేయడానికి అవసరమైన అనుబంధ పద్దు ప్రవేశపెట్టి పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో టీఎన్జీవోల జిల్లాకార్యదర్శి ఆకుల సత్యం,టీ రెవిన్యూ జిల్లా కార్యదర్శి చెలుకల కృష్ణ,టీ పెన్షనర్ల జిల్లా కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం,రాష్ట్ర క్రీడా కార్యదర్శి జీ.ప్రభాకర్ రెడ్డి,టింగో జిల్లా అధ్యక్షుడు జీ ఎస్ ఆర్.విజేంధర్, టీటీయూ జిల్లా అధ్యక్షుడు నూనావత్ రాజు,టిఎన్జీవోల నేత శంషోద్జిన్,తిరుమల రావు, రమేశ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related Posts