YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

వార్డు వాలంటీర్లకు అవగాహన

వార్డు వాలంటీర్లకు అవగాహన

వార్డు వాలంటీర్లకు అవగాహన
చిత్తూరు, సెప్టెంబర్ 10 
నగర పాలక సంస్థ పరిధిలో చేపట్టే కార్యక్రమాల గురించి వార్డు వాలంటీర్ లకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా నగరపాలక సంస్థ కమిషనర్ ను ఆదేశించారు. మంగళవారం ఉదయం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ లో భాగంగా దుర్గా నగర్ చెరువు, దుర్గా నగర్ కాలనీ ని అలాగే సంతపేట సమీపం లో గల నీవా నది పారే లిల్లీ బ్రిడ్జ్ ను పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ లో భాగంగా నగరపాలక పరిధిలోని దుర్గా నగర్ కాలనీ లో గల చెరువును పరిశీలించి ఈ చెరువుకు బ్యూటిఫికేషన్ చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. దుర్గా నగర్ కాలనీ చెరువు వద్ద జిల్లా కలెక్టర్ చెట్లు నాటి నీరు పోసారు. ఈ సందర్భంగా ఇక్కడకి విచ్చేసిన వార్డు వాలంటీర్ లతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్త పై దుర్గా నగర్ కాలనీలో ప్రజలతో అవగాహన కల్పించాలని అలాగే హౌస్ హోల్డ్ సర్వే ఎంత వరకు వచ్చిందని వార్డు వాలంటీర్లను జిల్లా కలెక్టర్ ప్రశ్నించగా వార్డు వాలంటీర్లు జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ హౌస్ హోల్డ్ సర్వేలో భాగంగా 10 మందిని గుర్తించడం జరిగిందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ దుర్గా నగర్ కాలనీ మొత్తం కలియ తిరిగారు. ఇందులో భాగంగా ఈ కాలనీలో ప్రజలు తడి చెత్తను, పొడి చెత్తను ఎలా నగర పాలక పారిశుధ్య కార్మికులకు అందిస్తున్నారన్నది పరిశీలించారు. ఇదే కాలనీలో జిల్లా కలెక్టర్ ఇళ్లను తనిఖీ చేసి నగరపాలక సిబ్బంది అందజేసిన హోం కొంపోస్ట్ ను ఎలా వాడుతున్నారనేది ప్రజలను అడిగి తెలుసుకున్నారు. దుర్గా నగర్ కాలనీ వద్ద జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బెంగళూరు తరహాలో చెత్త సేకరణ లో భాగంగా చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలో వారం లో 5 రోజులు తడి చెత్తను, అలాగే 2 రోజులు పొడి చెత్తను సేకరించే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగిందని, ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని పరిశీలించడానికే నేడు విచ్చేయడం జరిగిందని 
తెలిపారు. తడి చెత్త, పొడి చెత్త ఎలా అందించాలనే దాని పై వర్డ్ వాలంటీర్ లు ప్రజలకు అవగాహన కలపించాలన్నారు. వర్మి కొంపోస్ట్ ను తడి చెత్త నుండి వాడుకొనవచ్చునని తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలోని అన్నీ వార్డులలో తడి, పొడి చెత్తల సేకరణ కార్యక్రమం జరగాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ సంత పేట సమీపం లో గల నీవా నది పారే లిల్లీ బ్రిడ్జ్ ను పరిశీలించి ఈ లిల్లీ బ్రిడ్జ్ వద్ద జంగిల్ క్లియరెన్స్ చేయించి నీరు సాఫీగా వెళ్ళే విధంగా చర్యలు చేపట్టాలని, అలాగే దురాక్రమణ కు సంబంధించి వర్కింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. 
ఈ కార్యక్రమం లో నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేశు, నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డా.వినోద్ కుమార్, నగరపాలక సంస్థ పరిధిలోని అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts