వనపర్తిలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను పరామర్శించిన మాజీ మంత్రి
వనపర్తి, సెప్టెంబర్ 10
వనపర్తి జిల్లా దవాఖాన ను మాజీ మంత్రి ఏఐసిసి కార్యదర్శి జి చిన్నారెడ్డి సందర్శించారు హాస్పిటల్లో ఉండే పేషెంట్లకు ఏ రకమైనటువంటి వైద్యం అందుతుందో ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరించి వారికి సోకిన టువంటి వ్యాధులకు సరైన చికిత్స అందుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. అందిన సమాచారం ప్రకారం ఈరోజు వనపర్తి హాస్పిటల్లో చిన్నపిల్లలు , ఇంకా ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో చాలామంది చికిత్స కొరకు వేచి ఉన్నారు హాస్పిటల్ లో చాలామంది వైరల్ ఫీవర్, లతో డెంగ్యూ ఫీవర్, తో మోషన్స్ తో సతమతమవుతున్నారు. చిన్నారెడ్డి డాక్టర్ని అడిగి తెలుసుకో గా ప్రభుత్వం అందుబాటులో పెట్టినటువంటి కొన్ని మందులు గానీ కొన్నింటికి సంబంధించిన రోగాలకు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం రోగుల విషయంలో ఇంకా శ్రద్ధతో వారి యొక్క ఆరోగ్యాన్ని వాటికి సంబంధించినటువంటి మందులను సప్లై చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చిన్నారెడ్డి చెప్పారు. పేషెంట్లకు రోగానికి సరిపడే మందులు లేనందువల్ల వారు బయటకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందని, ఇక్కడికి వచ్చే వారంతా కూడా చాలా బీద కుటుంబికులు వారు బయటికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకునే స్థోమత లేదని, వారికి విధమైన మందులు గానీ ఇంజెక్షన్లు ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చిన్నారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తైలం శంకర్ ప్రసాద్, పీసీసీ సభ్యులు శ్రీనివాస గౌడ్, పట్టణ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డి కిరణ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాగి వేణు వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కోట్ల రవి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు కమ్మర్, మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు, సతీష్, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు చంద్రమౌళి, వనపర్తి పట్టణ కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షులు అనీష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బ్రహ్మం చారి, బాబా , అబ్దుల్లా రాధాకృష్ణ, మర్రికుంట జనార్ధన్ ,శ్రీనివాసులు , వేణు చారి వెంకటేశ్వర్ రెడ్డి, సందీప్, సీతయ్య, రాములు, మన్యం పాల్గొన్నారు