వైభవంగా వినాయక నిమజ్జనం
- ఎంపీ టిజి వెంకటేష్
కర్నూలు సెప్టెంబర్ 10
దేశ సంస్కృతిని చాటే విధంగా కర్నూలులో వినాయక ఉత్సవాలు ఉంటాయని రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ అన్నారు. మంగళవారం గణేష్ నిమజ్జనం ఉత్సవాల్లో భాగంగా నగరంలోని రాంబోట్ల దేవాలయం వద్ద ఉన్న వినాయకుని విగ్రహాన్ని టిజి వెంకటేష్ దర్శించుకున్నారు. విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి నిమజ్జన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని విధంగా కర్నూల్లో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. కులమతాలకు అతీతంగా ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారన్నారు. వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ముస్లిం దేశం అయిన ఇండోనేషియా లో నోట్ల మీద వినాయకుని బొమ్మ ఉంటుందని చెప్పారు. అక్కడి ప్రజలు మన సంస్కృతి ని చక్కగా ఆచరిస్తున్నారని తెలిపారు. మనదేశంలో హిందు మతం గురించి మాట్లాడితే కమ్యునల్ గా చూస్తారని.. ఇది రదృష్టకరమన్నారు. ప్రజల్లో మార్పు రావాలన్నారు.