జోరుగా రఘరాముడు విన్యాసం
అటు బీజేపీ, ఇటు వైసీపీతో సమ ప్రాధాన్యం
ఏలూరు, సెప్టెంబర్ 11,
రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎలా మసులుకోవాలో.. అలానే మసులు కోవాలి. ఏ మాత్రం తేడా వచ్చినా అంతే! పని ఖతం.. దుకాణం బంద్!! బహుశ ఈ సూత్రం వ్యాపారాల్లో తలమునకలైన రాజకీయ నేతలకు బాగానే తెలిసి ఉంటుంది. ఇలాంటి నాయకుల్లో కీలకంగా తెరమీదికి వస్తున్నారు.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి ఎంపీగా విజయం సాధించిన వైసీపీ నాయకుడు కనుమూరి రఘురామ కృష్ణం రాజు. రాజకీయాల్లో ఈయన అనేక పార్టీలు మారారు. అనేక లాభ నష్టాలను చవిచూశారు. ఇక, వ్యాపార వర్గాల్లోనూ ఆయన సుపరిచితుడే! తన వ్యాపారాల విషయంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేదనే విమర్శలు ఎదుర్కొన్నారు.కూడాప్రస్తుతం వైసీపీలో ఉన్న రఘురాముడు.తాను ఎంపీగా గెలిచిన తర్వాత నేరుగా కుటుంబ సమేతంగా వెళ్లి బీజేపీ నాయకుడు, ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వచ్చారు. ఆయన పలు పుస్తకాలను బహుమానంగా కూడా ఇచ్చి `గుర్తుంచుకోండి సార్!`-అంటూ గిల్లి వచ్చారు. దీంతో ఆయన పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే, వ్యాపారిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన రఘురాముడు ఏ ఒక్క పార్టీకో పరిమితం అయితే, మజా ఏముంటుందని అనుకున్నారో.. ఏమోతాను వైసీపీలోనే ఉంటానని అయితే, కేంద్రంలో ఉన్న పార్టీతోనూ, పెద్దలతోనూ సంబంధాలు నెరుపుతానని చెప్పుకొచ్చారు.గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆయన ఆ తర్వాత వైసీపీ అటు నుంచి బీజేపీలోకి వెళ్లి వయా టీడీపీ మీదుగా తిరిగి వైసీపీలోకి వచ్చారు. ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో ఎంపీగా స్వల్ప మెజార్టీతో గెలిచారు. ఇక ఇటు వైసీపీ ఎంపీగానే ఉంటూ అటు తన వ్యాపార సంబంధాల నేపథ్యంలో బీజేపీ పెద్దలకు చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. బహుశ ఈ క్రమంలోనే అనుకుంటా ఆయన బీజేపీ నేతలు తన సొంత పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ను దుయ్యబడుతున్న ఆయన ఏమీ అనడం లేదు., అలాగని పూర్తిగా మౌనం వహిస్తున్నాడా ? అంటే అదీ లేదు. జనసేన నాయకులు జగన్‌ను విమర్శిస్తే మాత్రం ఆయన మీడియా లైవ్ కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి విమర్శలు చేస్తున్నారు.మరి ఈ విషయం జగన్‌కు తెలిసినా.. ఆయన కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారని సమాచారం. పార్టీలో అనేక మంది అనేక విధాలుగా ఉంటారని, అందరినీ ఎక్కడ సరిచేస్తామని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. దీంతో రఘురాముడి విన్యాసం జోరుగా సాగుతోంది. పైగా ఆయన వైఎస్ ఆత్మ కెవిపీ.రామచంద్రరావుకు స్వయానా వియ్యంకుడు. ప్రస్తుతం బ్యాంకుల నుంచి వివిధ రూపాల్లో నోటీసులు కూడా అందుకున్నరఘురాముడు..వాటి నుంచి తప్పించుకునేందుకు కేంద్రంతోనూ, తనకు టికెట్ ఇచ్చి గెలిపించిన జగన్‌ను సమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక, ఈ విషయంలో జగన్ కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది