YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

బాలయోగి గురుకులంలో ఇంటర్ 

Highlights

  • ప్రవేశాల తరుణం..
  • ఆన్ లైన్ లో దరఖాస్తులు
  • 5వ తరగతికి దరఖాస్తుల ఆహ్వానం
  • ఈ నెల 20తో గడువు పూర్తి
బాలయోగి గురుకులంలో ఇంటర్ 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాలయోగి గురుకులాల్లో ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ కూడా ప్రారంభమవుతోంది. ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు సంబంధించి అనుమతులు వచ్చాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. కాగా గురుకులాల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పాఠశాలలలో ప్రవేశాలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
 షెడ్యూల్డు కులాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి వారిని ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్లాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలో  పూర్తిస్థాయి వసతులు.. నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులతో బోధన.. విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ, నిరంతర పర్యవేక్షణతో కొనసాగుతుంది.
5వ తరగతిలో ప్రవేశాలు
ఏపీ బాలయోగి గురుకులం (బాలికలు)లో 2018-19 విద్యాసంవత్సరంలో 5వ తరగతిలో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20వ తేదీతో గడువు ముగుస్తుంది. మొత్తం సీట్లు 80 ఉండగా వీటిలో షెడ్యూల్డు కులాలకు చెందిన వారికి 70 సీట్లు, షెడ్యూల్డు తెగలకు 5 సీట్లు, వెనుకబడిన తరగతులకు 4 సీట్లు, ఓసీలకు ఒక సీటు చొప్పున కేటాయించారు.
వచ్చేనెల 8వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులను వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్కార్డు తప్పనిసరిగా ఉండాలి.
పెద్దపాడు బాలయోగి గురుకులంలో...
శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడులోని బాలయోగి బాలికల గురుకులంలో పూర్తిస్థాయి బోధనా సౌకర్యాలతో విద్యార్థులకు బోధన అందిస్తున్నారు. విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసం పెంపొందించేందుకు చర్యలు చేపట్టడంతో ఇక్కడ ప్రవేశాలకు మంచి డిమాండ్ ఉంది. అధునాతన డిజిటల్ తరగతులు... అటల్ టింకరింగ్ ల్యాబ్లతో విద్యార్థులకు బోధన అందిస్తున్నారు. విశాలమైన కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయంతో ఈ గురుకులం కార్పొరేట్ పాఠశాలను మైమరపించేలా ఉంటుంది. ఇక్కడి విద్యార్థులు సంగీత సాహిత్య పోటీల్లో రాష్ట్రంలో కూడా గుర్తింపు సాధించడం విశేషం.

Related Posts