అచ్చెన్నాయుడి ఆరెస్టును ఖండించిన చంద్రబాబు
అమరావతి సెప్టెంబర్ 11,
టిడిపి బిసి,ఎస్సీ నేతలను అరెస్టులను మాజీ ముఖ్యమత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖండించారు. పోలీసుల వ్యవహార శైలిని చంద్రబాబు తప్పుపట్టారు. నన్ను కలవడానికి వచ్చిన నేతలపై ఇంత దురుసుగా వ్యవహరిస్తారా..? బాధితులకు న్యాయం చేయమని అడిగేవారిపై ఇన్ని దౌర్జన్యాలా..? శాంతియుతంగా నిరసనలను చేస్తుంటే అడ్డుకోవడం ఏమిటని నిలదీసారు. టిడిఎల్ పి ఉపనేత అచ్చెన్నాయుడు పట్ల అమర్యాదగా వ్యవహరిస్తారా..? బిసి నేతలు దువ్వారపు రామారావు, జగదీష్ లను అవమానిస్తారా..? టిడిపి ఎస్సీ నేత మాజీ మంత్రి జవహర్ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తారా..? మంగళగిరి, దుగ్గిరాల, తెనాలి..ఎన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పుతారని ప్రశ్నించారు.