YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ప్రజాస్వామ్యంలో చీకటి రోజు టిడిపి సీనియర్ నేతలతో చంద్రబాబు భేటి

ప్రజాస్వామ్యంలో చీకటి రోజు టిడిపి సీనియర్ నేతలతో చంద్రబాబు భేటి

ప్రజాస్వామ్యంలో చీకటి రోజు
టిడిపి సీనియర్ నేతలతో చంద్రబాబు భేటి
అమరావతి,  సెప్టెంబర్ 11,
రాష్ట్ర, జిల్లాల పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ‘ఛలో ఆత్మకూరు’ను అడ్డుకోవడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళా వెంకట్రావు, కాలువ శ్రీనివాసులు, చినరాజప్ప,లోకేష్, రామానాయుడు, నాగేశ్వర్ రెడ్డి, రామరాజు తదితరులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అరెస్ట్లను ఖండించారు. నిర్బంధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో దీనిని ఒక చీకటి రోజు అని.. ఇదొక నిరసన దినంగా అభివర్ణించారు. పునరావాస శిబిరానికి ఆహారం సరఫరా అడ్డుకుంటారా..? శిబిరంలో బాధితులకు ఇచ్చే ఆహారం అడ్డుకోవడం అమానుషమని చంద్రబాబు వాపోయారు. ఇంత పెద్దఎత్తున హవుస్ అరెస్ట్ లు చరిత్రలో లేవు. ఇంతమందిని హవుస్ అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది నేతలను హవుస్ అరెస్ట్ చేశారు. వైసిపి ప్రభుత్వ అణిచివేత వైఖరిని అందరూ గర్హించాలని అన్నారు. ప్రజా సంఘాలు, మేధావులు ముక్తకంఠంతో ఖండించాలి. నివసించే హక్కు, ఆస్తులు కాపాడుకునే హక్కు అందరికీ ఉంది. బాధితులకు న్యాయం చేయడంలో విఫలం అయ్యారు. న్యాయం కోసం పోరాడుతున్న టిడిపిని అణిచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 

Related Posts