చంద్రబాబు నిరాహార దీక్ష
గుంటూరు సెప్టెంబర్ 11,
ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి బయలుదేరిన టీడీపీ నేతలను ఎక్కికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నేతలను హౌజ్ ఆరెస్టు చేసారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు ఛలో పల్నాడు కి పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ పునరావాస శిబిరానికి ఆహారం సరఫరాను పోలీసులు అడ్డుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు సంఘీభావంగా ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయన దీక్ష చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు దీక్షలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. నోవోటల్ హోటల్ లో మాజీ మంత్రి అఖిల ప్రియ ను పోలీసులు అడ్డుకున్నారు. హోటల్ రూమ్ లోకి మగ పోలీసులు రావడం పై తీవ్ర అభ్యమతరం వ్యక్తం చేసిన అఖిల ప్రియ, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గుంటూరు నుండి తిరిగి వచ్చిన రామయ్య ను చుట్టు ముట్టిన పోలీస్ ఆయనను ఇంటి లోనికి పంపి హౌస్ అరెస్ట్ చేసారు. మాజీ మంత్రి
ప్రత్తిపాటి పుల్లారావు, తెలుగుయువ నేత దేవినేని అవినాష్ లు హౌస్ అరెస్ట్ చేసారు.