ఇసుక విధానంపై సీఎం జగన్ సమీక్ష
అమరావతి సెప్టెంబర్ 11
సచివాలయంలో ఇసుక విధానంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఇసుక విషయంలో చాలామంది రాళ్లేయడానికి చూస్తున్నారన్న సీఎం, అవినీతిని అడ్డుకోవడం వల్ల అది
సహించలేని వారే ప్రభుత్వంపై రాళ్లు వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. విమర్శలు రాకుండా చూడాలి. స్టాక్యార్డు పాయింట్లు పెంచాలి. వరద తగ్గగానే వెంటనే రీచ్ల నుంచి ఇసుకను వీలైనంత త్వరగా స్టాక్ యార్డులకు చేర్చాలి. ఇసుక మాఫియా లేకుండా చేయడానికి అవసరమైన సాంకేతిక సహకారం తీసుకోండని అధికారులకు సూచించారు. ఇసుక విషయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి. ఈ స్ధాయిలో కూడా అవినీతి ఉండకూడదని అధికారులకు స్పష్టం చేసారు. అధికారులు అప్రమత్తంగా ఉండి, ధ్యాస పెట్టాలి. రవాణా విషయంలో ఇబ్బందులు ధిగమించామా అని అధికారులను ప్రశ్నించారు. వరదల కారణంగా ఇప్పుడున్న సమయాన్ని, పద్ధతులని సజావుగా సాగేందుకు వినియోగించుకోవాలని అన్నారు. ఎక్కడెక్కడ ఇసుక కోసం కొరత ఉందో ఆయా ప్రాంతాల్లో
నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలి. అందుకనుగుణంగా నిర్మాణాదారులు ప్లాన్ చేసుకుంటారని అయన అన్నారు. ఎప్పటినుంచి ఇసుక అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని నిర్మాణదారులకు
ముందుగా తెలియజేస్తే బాగుంటుంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అన్ని చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు పెట్టాలని అన్నారు. పుటేజీని మానిటరింగ్ చేసే వ్యవస్ధ కూడా ఉండాలి. బల్క్
యూజర్లు కోసం ప్రత్యేక స్టాక్ యార్డులు ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలని అన్నారు.
అయితే, వర్షాలు, వరదల కారణంగా ఇసుకను తవ్వడానికి తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి.
భారీ వర్షాలు కారణంగా రీచ్ల నుంచి ఇసుకను తీసుకురాలేకపోతున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కేవలం 25 రీచ్ల నుంచి మాత్రమే ఇసుకను తీయగలుగుతున్నాం. నదుల పక్కన
తవ్విన ఇసుక కూడా వరదల కారణంగా కొట్టుకుపోయింది. లంక భూములు కూడా మునిగిపోయాయని తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతం 23 వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు అందుబాటులో
ఉన్నాయని తెలిపారు. మొదటి మూడురోజులు పరిశీలిస్తే రోజుకు 10 నుంచి 12 వేల మెట్రిక్ టన్నుల ఇసుక డిమాండ్ ఉంది. సిమెంట్ కొనుగోళ్లు ఆధారంగా ఇసుక డిమాండ్ను పరిగణలోకి తీసుకుంటున్నాం. రవాణా విషయంలో 90 శాతం వరకు ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు.