పల్లెలను పచ్చదనం పరిశుభ్రత తో తీర్చిదిదాలి
- జెడ్పి చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ
వేములవాడ ,సెప్టెంబర్ 11
నెల రోజుల్లో జిల్లాలోని పల్లెలు పచ్చదనం తో,పరిశుభ్రతతో కలకళలాడేలా చూడాలని జెడ్పి చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు బుధవారం రుద్రoగి మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన 30 రోజుల ప్రణాళిక పై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గోన్నారు.ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో గ్రామాభివృద్ధికి పాటుపడాలని అన్నారు.ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై గ్రామ అభివృద్ధి సహకరించాలని అన్నారు.వచ్చే దసరా బతుకమ్మ పండుగ వరకు గ్రామం పచ్చదనం పరిశుభ్రతో వెల్లి విరియాలని,గ్రామాభివృద్ధి కి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని
తెలియజేసారు.గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు కృషి చేయాలని అన్నారు.మానవుని మనుగుడకు మొక్కలను నాటాలనిన్నారు.ముందుగా చoదుర్తి మండలం కిష్టంపెట గ్రామం లో గణేష్
నవరాత్రులు సందర్భంగా వినాయకుడిని దర్శించుకుని పూజలను నిర్వహించారు అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ రవీందర్, రుద్రoగి,వేములవాడ
జెడ్పిటిసి లు మీనయ్య ఏశ వాణి, చందుర్తి ఎంపీపీ లావణ్య, పాల్గొన్నారు.