ప్రభుత్వ పథకాలను అమలు పరచడమే ధ్యేయం
సర్పంచ్ శ్రీనివాసులు
వనపర్తి ,సెప్టెంబర్ 11
గ్రామాల అభివృద్ధి కోసం, ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమాన్ని అమలుపరచడమే తమ ధ్యేయమని గోపాల్ పేట
సర్పంచ్ శ్రీనివాసులు అన్నారు. ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం గోపాల్పేట పరిధిలోని ఎర్రగట్టు తండాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా
తండాలో ఏపుగా పెరిగిన కంపచెట్లు తొలగించేందుకు మరియు గుంతలు పడిన రోడ్డును బాగు చేయించేందుకు జెసిబి కి కొబ్బరికాయను కొట్టి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్
శ్రీనివాస లతోపాటు పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర రావు కోఆప్షన్ సభ్యులు మతిన్, వడ్డే గోపాల్, మన్యం నాయక్, తదితరులు పాల్గొన్నారు.