YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హామీలు నెరవేర్చకుండా కోతలు కోస్తున్నారు

Highlights

  • గట్టిగా అడిగితే బురద జల్లుతున్నారు'
  • కేంద్రం నుంచి రావాల్సినవి ఇవే..
  • ఏకరువు పెట్టిన చంద్రబాబు
 హామీలు నెరవేర్చకుండా కోతలు కోస్తున్నారు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి  విభజన సమయంలో ఇచ్చిన  హామీలను  నెరవేర్చకుండా కోతలు కోస్తున్నారని  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. సోమవారం శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చంద్రబాబు మాట్లాడారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలోనూ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.  విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సంస్థలు ఇతరత్రాపై ముఖ్యమంత్రి చంద్రబాబు  ఏకరువు పెట్టారు. మాటలు చెప్పి తప్పించుకుంటోంది. పోలీసు అకాడమీ, సీసీఎంబీ వంటి సంస్థలు రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు?. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భాగం కాదా?. విభజన బలవంతంగా చేశాక రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు.  విభజన చట్టంలో ఉన్న వాటినే అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామే తప్ప వ్యక్తిగతంగా ఏమీ కోరడం లేదన్నారు.  రాష్ట్ర ఆర్థిక లోటుపై ఆయన స్పందిస్తూ కొంతమంది కావాలనే దాన్ని వివాదం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి రూ.16,700కోట్ల లోటుంటే రూ.4వేల కోట్లే ఇచ్చారని ఆయన అన్నారు. కేంద్రం ఇవ్వాల్సిన పెన్షన్లు కూడా రాష్ట్రానికి సరిగా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రావాల్సిన వాటిపై అసెంబ్లీ స్పష్టం చేశారు.
కేంద్రం నుంచి రావాల్సినవి ఇవే..
''విశాఖ రైల్వేజోన్ ఎందుకు ఇవ్వడం లేదు? రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఊసే లేదు. రూ.40 వేల కోట్ల భూములను రైతులు రాజధానికి ఇచ్చారు. రాజధానికి రూ.1500 కోట్లు ఎలా సరిపోతాయి? ఏపీకి రాజధాని నగరం అవసరం లేదా? సహాయం చేయకపోగా విమర్శించడం, వెక్కించడం సబబా? హైదరాబాద్లో ఎన్నో పరిశోధనా సంస్థలు ఉన్నాయి. ఏపీకి ఉదారంగా కేంద్ర సంస్థలు ఎందుకివ్వరు? ఏపీ భారతదేశంలో భాగం కాదా? 11 జాతీయ విద్యాసంస్థలకు నాలుగేళ్లలో రూ.400కోట్లే ఇచ్చారు.ఐదేళ్లయినా ఒక్కదానికీ సొంత భవనం లేదు. ప్రైవేటు వ్యక్తులకు భూములిస్తే ఆరునెలల్లో పనులు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వానికి భూములిస్తే ఇంతవరకు ప్రారంభం కాలేదు. చట్టంలో ఉన్నా అసెంబ్లీ సీట్లు పెంచడంలేదు, వాటితో నాకు పనిలేదు. కృష్ణపట్నం పోర్టు వల్ల వచ్చే ఆదాయం ఇంకా తెలంగాణకే పోతోంది. విజయవాడ, విశాఖ మెట్రో రైలు సాధ్యం కాదన్నారు. రాజధాని నిధులపై యూసీలు పంపాం, నీతి అయోగ్ ధ్రువీకరించింది. కియా మోటార్స్ కోసం ఎంతో కష్టపడ్డాం, ఎన్నో రాయితీలిచ్చాం'' అని చంద్రబాబు చెప్పారు.
ఏపీ శాసనసభ స్థానాలు పెంచుతామన్నారు. ఆ హామీ పట్టించుకోవడం లేదు. దాన్ని గట్టిగా అడిగితే నాపై బురద జల్లుతున్నారు' అని చంద్రబాబు అన్నారు. 'ప్రత్యేక హోదాకు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ అంశంలో వైకాపా ద్వంద వైఖరి ప్రదర్శిస్తోంది. ప్రత్యేక హోదా కోరుతూనే.. అది మోదీ వల్లే సాధ్యమవుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. మోదీపై విశ్వాసం ఉందని చెబుతూనే ఆ పార్టీ కేంద్రం అవిశ్వాసం పెడతామంటోంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?. చాలా అంశాల్లో కేంద్రం సహకరించకపోయినా, భారమైనా సరే రాష్ట్రం ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. ఆర్బీఐ ఒప్పుకోకపోయినా రైతు రుణమాఫీ చేశాం' అని చంద్రబాబు పేర్కొన్నారు

Related Posts