Highlights
- పోస్టల్ సర్కిల్లో కొలువులు..
- 1058 భర్తీకి చర్యలు
పోస్టల్ డిపార్ట్మెంట్ తెలంగాణ నిరుద్యోగులకు తీపి కబురు తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1058 పోస్టులకు పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్) లకు గాను ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు కావాల్సిన అర్హత..పదోతరగతి ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటె సరిపోతుంది. ఇది నిజంగా తెలంగాణ నిరుద్యోగులకు తీపి కబురే మరి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పోస్టు: గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్)
* ఖాళీలు: 1058
* అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం.
* వయసు: 18-40 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఎంపిక: అకడమిక్ ప్రతిభ ఆధారంగా
* దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్సీ, ఎస్టీలు; దివ్యాంగులు, మహిళలు ఫీజు చెల్లించనవసరం లేదు)
* ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.04.2018 .
మరిన్ని వివరాలకోసం : www.appost.in/gdsonline/