YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఏపీ బీజేపీ బాస్ రేసులో సుజనా..

ఏపీ బీజేపీ బాస్ రేసులో సుజనా..

ఏపీ బీజేపీ బాస్ రేసులో సుజనా....
విజయవాడ, సెప్టెంబర్ 12,
నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ అని చులకన‌ చేసి చూడనక్కరలేదు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామే అన్న ధీమా ఉన్న ఏకైక పార్టీ బీజేపీ. పైగా. ఏపీలో పవర్ లేకపోయినా కేంద్రంలో పవర్ ఫుల్ నరేంద్రమోడీ ఉన్నారు. అక్కడ మరో ప్రత్యామ్నాయ రాజకీయం కూడా లేదు. అందువల్ల అక్కడి అధికారం నీడలో ఏపీలో హాయిగా హవా చలాయించవచ్చు. అందుకే ఇపుడు ఏపీ బీజేపీకి పొలిటికల్ గ్లామర్ పెరిగింది. పార్టీని అభివృధ్ధి చేద్దామనుకునే వారి కంటే పార్టీని వాడుకుందామనుకునే వారే ఇపుడు అక్కడ ఎక్కువగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఏపీలో ఏదో విధంగా కొత్త బలాన్ని తెచ్చుకుందామని కేంద్ర నాయకత్వం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. నాయకులను కూడా చేర్చుకుంటూ బలంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ తన సిధ్ధాంతాలను సైతం పక్కన పెట్టి ప్రయోగాలు కూడా చేస్తోంది.  కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఏపీ బీజేపీ సారధిగా అవకాశం ఇచ్చారు. రెండేళ్ల పార్టీ సారధ్యం చూశాక ఇక ఆయన మీద హై కమాండ్ కి ఆశలేవీ పెద్దగా లేవని చెబుతున్నారు. దాంతో ఏపీ బీజేపీకి కొత్త సారధిని నియమించి పార్టీని ఉరకలెత్తిందాలనుకుంటున్నారుట.ఇక పార్టీ సంస్థాగత ఎన్నికలు డిసెంబర్లో జరుగుతాయని అంటున్నారు. సభ్యత్వ నమోదు ఇప్పటికే పూర్తి అయినందువల్ల వార్డు, గ్రామ, మండల, పట్టణ, జిల్లా స్థాయిల్లో ఎన్నికలు జరిపించి డిసెంబర్ నాటికి కొత్త 
కార్యవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ఎన్నుకుంటారని అంటున్నారు. నిజానికి పార్టీ ఎన్నికలు అని అనడమే కానీ నామినేట్ చేయడమేనని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అటు తెలంగాణా, ఇటు ఏపీల్లో కూడా కొత్త అధ్యక్షులను ఎంపిక చేయాలన్న ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లుగా చెబుతున్నారు. బీజేపీ అధ్యక్షుని పదవీ కాలం మూడేళ్ళు. అయితే ఏపీలో ఆరేళ్ళ పాటు హరిబాబు అధ్యక్షునిగా కొనసాగారు. ఆయనకు ఢిల్లీ స్థాయిలో బలం ఉన్న నేత ఒకరు ఉండడం వల్ల అది సాధ్యపడింది. మరి కన్నా విషయం తీసుకుంటే ఆయనకు అలాంటి అవకాశం లేదని అంటున్నారు. పైగా కాపు కార్డును ఓసారి ప్రయోగించి చూశారు. అది ఫట్ అయిది. దాంతో ఇపుడు కన్నా ప్లేస్ లో కొత్తవారికే అవకాశం అంటున్నారు.ఇక ఏపీలో అధికార వైసీపీ రెడ్డి సామాజికవర్గానికి ప్రతినిధిగా ఉంది. టీడీపీ ఎటూ కమ్మల పార్టీగా ఉంది. జనసేన కాపుల పార్టీగా ముద్ర పడింది. ఈ మూడు ప్రధాన సామాజిక వర్గాలు కాకుండా బీసీల నుంచి నాయకత్వాన్ని ఎంపిక చేస్తే పార్టీకి మేలు జరుగుతుందన్న ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. యాభై శాతానికి పైగా బీసీలు ఏపీలో ఉన్నారు. వారిని కనుక ఆకట్టుకుంటే అధికార మార్గం దొరుకుతుందని భావిస్తున్నారు. మరి బీసీల్లో ఫేస్ వాల్యూ ఉన్న వారు, ఏపీలో మొత్తం పార్టీని లీడ్ చేసే వారు ఉండాలి. ఎవరు అన్నది ఇపుడు అన్వేషణ సాగుతోందట. ఓ వైపు జగన్ పూర్తి జనాకర్షణతో ఉన్నారు. చంద్రబాబుది రాజకీయ చాణక్యం. ఈ ఇద్దరినీ తట్టుకుని నిలవాలంటే మంచి నాయకుడు కావాలి. ఆ దిశగానే బీజేపీ వేట సాగుతుందని అంటున్నారు. అయితే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై పాత కాపు సోము వీర్రాజు పెద్ద ఆశలే పెట్టుకున్నారు.ఆయనకు ఢిలీ స్థాయిలో ఓ వర్గం మద్దతు ఉంది. గతసారి చివర్లో ఆయనకు పదవి చేజారింది. అయితే ఆయన కాపు సామాజికవర్గం నేత. ఇక పార్టీలో కొత్తగా చేరిన సుజనా చౌదరి సైతం అవకాశం ఇస్తే ఓకే అంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయనది కమ్మ సామాజికవర్గం. మరి బీసీలకు చాన్స్ అంటున్న బీజేపీ ఈ ప్రతిపాదనలు పరిశీలిస్తుందా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా అటు టీడీపీ, ఇటు వైసీపీలకు సమాన దూరం పాటించేవారికే బీజేపీ అధ్యక్ష పదవి అంటున్నట్లుగా తెలుస్తోంది.

Related Posts