YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

స్పీడ్ పెంచిన  చంద్రబాబు

స్పీడ్ పెంచిన  చంద్రబాబు

స్పీడ్ పెంచిన  చంద్రబాబు
విజయవాడ, సెప్టెంబర్ 12, 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పీడ్ పెంచారు. పార్టీ శ్రేణుల్లో తిరిగి ఉత్సాహం నింపుతున్నారు. నేతలు కొందరు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నప్పటికీ క్యాడర్ పైనే ఆయన ఎక్కువగా దృష్టి పెట్టారు. బలమైన ఓటు బ్యాంకు ఉన్న తెలుగుదేశం పార్టీకి నేతలు ముఖ్యం కాదన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అందుకే ముందు క్యాడర్ లో జోష్ నింప గలిగితే నేతలు వారంతట వారే కార్యక్రమాల్లోకి వస్తారని చంద్రబాబు వేసిన అంచనా నిజమే అవుతుంది.చలో ఆత్మకూరు కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ నుంచి మంచి స్పందన వచ్చింది. పేరుకు పల్నాడు కార్యక్రమమే అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు గుంటూరు చేరుకునేందుకు ఉత్సాహం చూపారు. దీంతో నేతలు కూడా ముందుకు రాని పరిస్థతి తలెత్తింది. ముందురోజే మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి, అఖిలప్రియ లాంటి నేతలు గుంటూరుకు చేరుకుని కార్యక్రమానికి ముందు నిలవడం విశేషం.ఇక చంద్రబాబు మూడేళ్లలో జమిలి ఎన్నికలు వస్తాయని గట్టిగా విశ్వసిస్తున్నారు. మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉండటంతో చంద్రబాబు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. మూడేళ్లు అంటే ఎక్కువ సమయమున్నప్పటికీ కోలుకోలేని రీతిలో గత ఎన్నికల్లో ఫలితాలు రావడంతో నేతలు, క్యాడర్ నైరాశ్యంలో మునిగిపోయారు. అందుకే చంద్రబాబు నోటి వెంట జమిలి ఎన్నికల మాట పదే పదే విన్పిస్తుంది.అయితే కొందరు నేతలు మాత్రం చలో ఆత్మకూరు కార్యక్రమంపై పెదవి విరుస్తున్నారు. కేవలం ఒక ప్రాంతానికే కార్యక్రమాన్ని పరిమితం చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. తమ ప్రాంతాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని చంద్రబాబును కోరుతున్నారు. ఒకవైపు కార్యక్రమాలు, మరో వైపు జిల్లా పర్యటనలతో చంద్రబాబు ఎక్కువ సమయం ప్రజలు, కార్యకర్తలతోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో నేతలు కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు స్పీడ్ పెంచడంతో పార్టీ శ్రేణుల్లోనూ జోష్ పెరిగింది.

Related Posts