YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

బీహార్ లో స్నేహానికి మళ్లీ బీటలు

బీహార్ లో స్నేహానికి మళ్లీ బీటలు

బీహార్ లో స్నేహానికి మళ్లీ బీటలు
పాట్నా, సెప్టెంబర్ 12, 

బీహార్ లో మళ్లీ చిచ్చు మొదలయింది. అధికార కూటమిలో నేతల మాటల యుద్ధం మొదలయింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, జనతాదళ్ యు ల కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండు పార్టీలూ కలసే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళతాయన్న ధీమా కూడా ఇరు పార్టీల్లో ఉంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ స్నేహానికి బీటలు పడుతున్నట్లు కన్పిస్తుంది. నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ బీజేపీ నేతలే స్వరం పెంచడం పరిస్థితికి అద్దం పడుతోంది.బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020లో జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూలు కలసి పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మొత్తం 243 సీట్లున్న బీహార్ లో 2015లో మహాగడ్బందన్ విజయం సాధించింది. జనతాదళ్ యు, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ లు కలసి పోటీ చేసి బీహార్ గడ్డపై విజయం సాధించాయి. అయితే తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యుల అవినీతికి పాల్పడుతున్నారంటూ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే వెనువెంటనే బీజేపీ మద్దతుతో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.ఎన్నికలకే ఏడాది సమయం ఉండటంతో నితీష్ కుమార్, బీజేపీ పెద్దలు కలసి సీట్లపై ఇంకా చర్చలు జరపలేదు. కానీ కలసి పోటీచేస్తారన్న సంకేతాలు మాత్రం ఇస్తున్నారు. నితీష్ కుమార్ కూడా గతం కంటే స్ట్రాంగ్ అయ్యారు. రాష్ట్రంలో మద్యనిషేధం విధించడంతో పాటు లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ లో పెట్టడం, గుట్కాలను నిషేధించడం, అభివృద్ధి పనులు వేగం చేయడంతో ఆయన పాలనకు మంచి మార్కులే పడుతున్నాయి. ఇప్పటికే నితీష్ కుమార్ అవినీతి లేని ముఖ్యమంత్రిగా పేరు గడించారు. పార్టీని పటిష్టం చేయడం కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పార్టీ ఉపాధ్యక్షుడిగా చేశారు నితీష్ కుమార్.బీజేపీ ఎమ్మెల్సీ సంజయ్ పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య చిచ్చురేపిందనే చెప్పాలి. పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలంటూ 
ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనతాదళ్ యు మండిపడుతోంది. పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వివరణ ఇవ్వాలని జేడీయూ పట్టుబడుతోంది. మరోవైపు పాశ్వాన్ వ్యాఖ్యలు బీజేపీ పెద్దల మనసులో నుంచి వచ్చినవేనన్న అనుమానాన్ని జేడీయూ నేతలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎన్నికలకు ముందు మైత్రికి గండి పడే అవకాశాలున్నాయా? అన్న అనుమానాలు లేకపోలేదు

Related Posts