సైరా కోసం 64 గ్రామాల సృష్టి
హైద్రాబాద్, సెప్టెంబర్ 12
చిరు హీరోగా సైరా నరసింహారెడ్డి చిత్రం విడుదలకు రంగం సిద్దమవుతుంది. ప్రమోషన్స్ లో కాస్త వీక్ గా ఉన్నప్పటికీ….. సై రా పోస్టర్ సోషల్ మీడియాలో కనబడిందంటే చాలు.. మెగా ఫాన్స్ తో పాటుగా ప్రేక్షకులను లైక్స్ తో హోరెత్తిస్తున్నాడు. భారీ క్రేజ్ ఉన్న సై రా సినిమా విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గత రెండేళ్లుగా సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకుంటున్న సై రా ముచ్చట్లు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అందులో తాజాగా సై రా కోసం వేసిన సెట్స్, సినిమా కోసం వెలసిన గ్రామాలూ అంటూ ఓ లిస్ట్ బయటికి వచ్చింది.సైరా సినిమాని భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ తెరకెక్కించాడు. ఇక సైరా సినిమా కోసం ఏకంగా 42 సెట్లు వేశారట. అంతే కాకుండా సినిమాలోని ఒరిజినాలిటీ కోసం.. ఆ కాలం ప్రతిబింబించేలా.. 64 గ్రామాలను కూడా సృష్టించారట.
అంతే కాకుండా బ్రిటిష్ కాలంలో వాడిన తుపాకుల్ని, ఫిరంగుల్ని తయారు చేశారు. సైరా యుద్ధ సామాగ్రికి అయిన ఖర్చుతోనే ఏకంగా రెండు చిన్న సినిమాల్ని చేయొచ్చని చెబుతున్నారు. అలాగే
ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కాలంలో ఇళ్లు ఎలా ఉంటాయో…. ఆ కాలం నాటి రాయలసీమ వాసులు ఎలాంటి దుస్తుల్ని ధరించేవారో చెప్పడానికి ఆధారంగా అప్పటి ఫొటోగ్రాఫ్స్ ఏమీ
దొరకలేదని, అందుకే పుస్తకాలలో చదివిన విషయాల్ని ఊహించి…. వాటికి అనుగుణంగా సెట్స్‌ని… కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేశామని చెబుతున్నారు. ఎంతైనా ఊహించి తయారు చెయ్యడం గ్రేటే కదా
==========================