YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పదో నెలలోనూ...ఢమాల్ మన్న ఆటో రంగం

పదో నెలలోనూ...ఢమాల్ మన్న ఆటో రంగం

పదో నెలలోనూ...ఢమాల్ మన్న ఆటో రంగం
ముంబై, సెప్టెంబర్ 12,
ఆర్థిక మాంద్యం దెబ్బకు ఆటో రంగం అతలాకుతలమవుతున్నది. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమన పరిస్థితులు వాహన విక్రయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ఆగస్టు ఆటో అమ్మకాలు క్షీణించాయి. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) 1997-98 నుంచి దేశీయ హోల్‌సేల్ వాహన విక్రయాలను నమోదు చేస్తున్నది. అయితే అప్పట్నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ లేనివిధంగా అమ్మకాలు గత నెల పతనమైనట్లు సియామ్ సోమవారం తెలిపింది. అన్ని విభాగాల్లోనూ సేల్స్ పడిపోయినట్లు స్పష్టం చేసింది. 
ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలు కలిపి ఆగస్టు నెలలో జరిగిన అమ్మకాలు 18,21,490 యూనిట్లుగా నమోదైయ్యాయి. గతేడాది ఆగస్టులో ఇవి 23,82,436 యూనిట్లుగా ఉన్నాయి. దీంతో ఈసారి 23.55 శాతం దిగజారినైట్లెంది. ఈ ఏడాది జూలైలో మొత్తం దేశీయ ఆటో అమ్మకాలు దాదాపు 19 ఏండ్ల కనిష్ఠానికి పతనమైన విషయం తెలిసిందే. నిరుడు జూలైతో చూస్తే 18.71 శాతం దిగజారి 22,45,223 యూనిట్ల నుంచి 18,25,148 యూనిట్లకు పరిమితమైయ్యాయి.వాహన విక్రయాలు క్షీణించడం వరుసగా ఇది 10వ నెల. గతేడాది నవంబర్ నుంచి ఈ పతనం కనిపిస్తున్నది. నెలనెలా పడిపోతూ.. ఆగస్టులో రికార్డు స్థాయికి దిగజారాయి. గత నెల ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 31.57 శాతం క్షీణించాయి. నిరుడుతో పోల్చితే 2,87,198 యూనిట్ల నుంచి 1,96,524 యూనిట్లకు తగ్గాయి. దీంతో అంతకుముందు నెల జూలైలో నమోదైన 30.98 శాతం కంటే ఎక్కువగా పడిపోయినైట్లెంది. మార్కెట్ లీడర్ మారుతి సుజుకీ అమ్మకాలు 36.14 శాతం పతనమై 93,173 యూనిట్లకు తగ్గాయి. హ్యుందాయ్ 16.58 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 31.58 శాతం క్షీణతలను చవిచూశాయి. ద్విచక్ర వాహనాల విషయానికొస్తే.. ఈ ఆగస్టులో 22.24 శాతం పడిపోయాయి. నిరుడు 19,47,304 యూనిట్లుగా ఉంటే, ఈసారి 15,14,196 యూనిట్లుగా ఉన్నాయి. మోటర్‌సైకిల్ అమ్మకాలు 22.33 శాతం, స్కూటర్ విక్రయాలు 22.19 శాతం క్షీణించాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు సైతం 38.71 శాతం దిగజారి 84,668 యూనిట్ల నుంచి 51,897 యూనిట్లకు క్షీణించాయి.హోల్‌సేల్ విక్రయాల పరిస్థితి దారుణంగా ఉన్నా.. రిటైల్ అమ్మకాలు కాస్త మెరుగ్గా ఉండటం ఆటో రంగానికి ఊరటనిస్తున్నది. గతేడాది ఆగస్టుతో పోల్చితే ఈ ఏడాది ఆగస్టులో 16,00,376 యూనిట్లుగా నమోదైయ్యాయి. నిరుడు 16,69,751 యూనిట్లుగా ఉన్నాయి. 4.15 శాతం మాత్రమే తక్కువగా నమోదైయ్యాయి. ప్యాసింజర్ వాహన విక్రయాలు సైతం 2,56,662 యూనిట్ల నుంచి 2,38,357 యూనిట్లకు తగ్గాయి. దీంతో 7.13 శాతం క్షీణించినైట్లెంది. 
టూవీలర్ అమ్మకాలు 3.4 శాతం పడిపోయాయి.వాహన పరిశ్రమను ఆదుకునేందుకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని ఆటో రంగం డిమాండ్ చేస్తున్నది. ఈ నెల 20న గోవాలో జీఎస్టీ మండలి సమావేశం జరుగుతున్నది. దీంతో వాహనాలపై జీఎస్టీని కనీసం 10 శాతమైనా కోత పెట్టాలని ఆయా సంస్థలు, సియామ్ కోరుతున్నాయి. విద్యుత్ ఆధారిత వాహన పరిశ్రమకు ఇచ్చినట్లుగానే ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై జీఎస్టీని 5 శాతానికి దించిన సంగతి విదితమే. వాహనాలపై 12 నుంచి 5 శాతానికి, చార్జర్లపై 18 నుంచి 5 శాతానికి తగ్గించారు. స్థానిక సంస్థలు అద్దెకు తీసుకునే ఎలక్ట్రిక్ బస్సులపైనా పన్ను మినహాయింపులిచ్చారు.

Related Posts