YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పాతపల్లి ఆంజనేయుడు నాన్ వెజిటేరియెన్

పాతపల్లి ఆంజనేయుడు నాన్ వెజిటేరియెన్

పాతపల్లి ఆంజనేయుడు నాన్ వెజిటేరియెన్
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 12, 
ఆంజనేయస్వామికి భక్తులు పూజలు ఏవిధంగా చేస్తారో మనకందరికి తెలుసు.దేశంలో,కానీ రాష్ట్రంలో కానీ తమలపాకులతో అలంకరణ చేసి నైవేద్యంగా స్వీట్లతో చేసిన వంటకాలను తయారు చేసి స్వామి ముందు పెట్టి పూజలు చేస్తారు.కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్దంగా కోళ్లు,గొర్రెలు,మేకలను బలిచ్చి వాటి మాంసంతో  ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెడుతారు.వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం"పాతపల్లి"గ్రామ సమీపంలో వెలసిన "చింతలకుంట ఆంజనేయస్వామి"ఈ పేరు ఏవిధంగా వచ్చిందంటే గుడి చుట్టూ చింతచెట్లు,పక్కనే ఓ నీటి కుంట కూడా వుండేదని అందుకే ఈ స్వామికి "చింతల కుంట ఆంజనేయస్వామి" అనే పేరు వచ్చిందని ఆలయ పూజారి చెబుతున్నాడు.ఈ ప్రాంత ప్రజల మొక్కులను తీర్చే అరాద్య దైవం కొరిన కోర్కెలను తీర్చి కొంగు బంగారం చేసే దేవుడు ఈ ఆంజనేయస్వామి.ఈ స్వామికి గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంత భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల భక్తుల నుండి పూజలు అందుకుంటున్నాడు.ఈ స్వామికి ప్రత్యేకత ఏమిటంటే గత కొన్ని 
సంవత్సరాలుగా మాంసాహారంతో పూజలు చేస్తున్నారు.మొదట్లో ఇదేంటి ఆంజనేయస్వామికి కోళ్లు,గొర్రెలు,మేకలు బలిచ్చి మాంసంతో పూజలు చేయడం మంచి పద్దతి కాదు అన్నవారు ఎంతో మంది.కానీ అది రాను రాను అనవాయితీగా కొనసాగుతుందని వారంలో సోమ,శని వారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులను తీర్చుకుంటున్నారని,అంతే కాకుండా సంక్రాంతి, ఉగాది,దసరా పండుగలకు భక్తులు ఇసుకేస్తే రాలనంతగా వస్తారని, భక్తుల సందడి రోజు రోజుకు పెరుగుతూ వస్తుందని స్థానికులు చెబుతున్నారు.ఈ ప్రాంత భక్తులే కాకుండా ఇతర జిల్లాల, రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులను తీర్చుకుంటున్నారని మొదటి సారి వచ్చే భక్తులు స్వామి వద్దకు వచ్చి తమ కోర్కెలను కోరుకుని వెళ్ళాక తమకు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే బందు,మిత్రులతో వచ్చి స్వామికి కోళ్లు,గొర్రెలు,మేకలను తెచ్చి బలిచ్చి వంటలు చేసుకుని కల్లుతో గుడి చుట్టూ కుటుంబ సభ్యులతో ప్రదక్షణలు చేసి స్వామి వారికి నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులు  బోజనాలు చేసుకుని తిరిగి తమ ప్రాంతాలకు వెళ్తారు.

Related Posts