YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

నిమ్స్ లో కొత్త నిబంధనలు... ఇబ్బందుల్లో రోగులు

నిమ్స్ లో కొత్త నిబంధనలు... ఇబ్బందుల్లో రోగులు

నిమ్స్ లో కొత్త నిబంధనలు... ఇబ్బందుల్లో రోగులు
హైద్రాబాద్‌, సెప్టెంబర్ 12,
 నిమ్స్ ఆసుపత్రిలో సేవల ఆలస్యంతో నిత్యం రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్లలో నూతన విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు సిడాక్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేవడం మరింత ఇబ్బందికరంగా మారిందని రోగులు వాపోతున్నారు. దీంతో రోగుల నమోదు ప్రక్రియలో జాప్యం కావడవంతో వైద్యులను సంప్రదించడానికి తంటాలు పడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. సాధారణ వ్యక్తులు నేరుగా నిమ్స్‌కు వచ్చి చికిత్సలు పొందలేని పరిస్థితులు నిమ్స్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో శ్రమించి రిజిస్ట్రేషన్ చేయించుకొని గంటలకొద్ది వేచి ఉండి వైద్యుడిని కలిసిగా ప్రయోజనం లేకుండా పోతుంది. సదరు వైద్యుడు సూచించిన వైద్యపరీక్షలు చేయించుకునేందుకు మూడు, నాలుగు చోట్లకు తిరిగి తెలుసుకోవాల్సిన వస్తుంది. అనంతరం పరీక్షలకు డబ్బులు చెల్లించి నమూనాలు ఇచ్చేందుకు వెళితే అక్కడ సిబ్బంది మరో విషయాన్ని చెప్పలేక అందుబాటులో లేకపోవడంతో మరుసటి రోజుకు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. తీరా నమూనాలు ఇచ్చిన అనంతరం మరో కష్టం వచ్చిపడుతుంది. కొన్ని పరీక్షలు వెంటనే పూర్తిచేసినప్పటికీ క్లిష్టమైన పరీక్షల కోసం ల్యాబ్‌లో 24 గంటల నుంచి 48 గంటల పాటు పెట్టాల్సి వస్తుంది. మరికొన్ని పాక్షికంగా అందుబాటులో లేకపోవడంతో రిపోర్టుల సేకరించేందుకు సైతం శ్రమించాల్సిన వస్తుందని పేర్కొంటున్నారు. అన్నింటిని తీసుకొని తిరిగి వైద్యున్ని కలిసి చికిత్సలు ప్రారంభం అయ్యేసరికి రోగితోపాటు రోగికి సహాయంగా వచ్చినవారు కూడా రోగులుగా మారాల్సి వస్తుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందుతుందని భావించి వస్తున్నవారికి సేవల్లో జాప్యం నరకాన్ని చూపిస్తుందంటున్నారు.నానాటికీ నిమ్స్‌కు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా అందుకు తగ్గ సిబ్బంది లేకపోవడం కూడా ఇందుకు కారణంగా 
తెలుస్తోంది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం నిమ్స్‌పై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం పలురకాల యంత్రాలను ప్రవేశపెట్టినా సుక్షితులైన సిబ్బంది కొరతతో ఆశించిన స్థాయిలో రోగులకు సేవలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.

Related Posts