పోలీసు నియామకాల ఫలితాలు విడుదల
అమరావతి సెప్టెంబర్ 12,
ఆంధ్ర ప్రదేశ్ పోలీసు కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన ఫలితాలను క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసారు.జ ఈ కార్యక్రమానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, డిజిపి గౌతమ్ సవాంగ్, ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ కుమార్ విశ్వజీత్ ఇతర అధికారులు హజరయ్యారు. సివిల్, ఆర్ముడ్ రిజర్వ్, ఏపిఎస్పీ, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, జైలు వార్డర్స్ విభాగాల్లో మొత్తం 2723 పోస్టులకు గాను 2623 పోస్టులనో పోలీసు శాఖ భర్తీ చేసింది. ఎస్ఎల్పీఆర్బీ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్ సైట్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఉంచారు. ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా సదరు వెబ్ సైట్ కు ఈ నెల 16 వ తేదీలోపు పంపవచ్చని పోలీసుశాఖ
పెర్కోంది.