YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాధుడు

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాధుడు

గంగమ్మ ఒడికి చేరిన గణనాధుడు
హైద్రాబాద్, సెప్టెంబర్ 12  
ఖైరతాబాద్  ద్వాదాశాదిత్య మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నారు.  10 రోజుల పాటు ఖైరతాబాద్ లో పూజలందుకొన్న మహాగణపతి సరిగ్గా  ఒంటి గంట 50 నిమిషాలకు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనమయ్యాడు. ఖైరతాబాద్ లో తెల్లవారు జామున 3గంట నుంచి ప్రారంభమైన శోభాయాత్ర హుస్సేన్ సాగర్ కు చేరుకుంది. టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లై‌ఓవర్, సెక్రటేరియట్, లుంబునీ పార్కు మీదుగా ఐదు గంటలపాటు శోభయాత్ర సాగింది. ట్యాంక్‌బండ్‌కు చేరిన మహాగణపతి నిమజ్జనానికి అధికారులు ప్రత్యేక క్రేన్ ఏర్పాటుచేశారు. దీని సాయంతో హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. విగ్రహానికి ఉన్న ఐరన్‌ తొలగించిన తర్వాత గంగమ్మ ఒడిలోకి గణనాథుడు చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా విగ్రహానికి సమీపంలో బారికేడ్లను ఏర్పాటుచేసిన పోలీసులు.. లోపలికి ఎవర్నీ అనుమతించ లేదు. విగ్రహానికి దూరంగానే భక్తులను నిలిపివేశారు.క్రేన్‌కు అనుసంధానించే వెల్డింగ్ పనులు ముందే పూర్తి చేశారు. వినాయక నిమజ్జనం కోసం ఉపయోగించే ఆధునిక క్రేన్‌ను జర్మనీ టెక్నాలజీతో రూపొందించారు. రిమోట్‌ కంట్రోలింగ్‌ ద్వారా పనిచేసే ఈ క్రేన్.. బరువును ఎత్తగానే ఎంత బరువు ఉంది, ఎంత దూరం ముందుకు తీసుకెళ్లగలదో చూపిస్తుంది. తద్వారా వాహనంపైకి చేర్చడం, నిమజ్జనం చేయడం సులువు చేశారు. ఈ వాహనం బరువు దాదాపు 72 టన్నులు. 400 టన్నుల మేర ఎత్తగల సామర్థ్యం ఉంటుంది. జాక్‌ 61 మీటర్ల ఎత్తు వరకు లేపగలదు. పొడవు 14 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు. 12 టైర్లు ఉంటాయి. క్రేన్‌తో అనుసంధానం పూర్తయిన తర్వాత మహాగణపతికి ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత తల్లి ఒడిలోకి గణపతిని సాగనంపారు.నిమజ్జనం చేసే హుస్సేన్‌సాగర్ ప్రదేశంలో 20 అడుగుల మేర పూడికను తొలగించారు. ఆ ప్రాంతంలోనే గణపతిని నిమజ్జనం చేస్తారు. అంతకు ముందు బుధవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత వెల్డింగ్ పనులు ప్రారంభించిన నిర్వాహకులు.. ఉదయం 6 గంటలకు భారీ క్రేన్ సాయంతో ట్రాలీపైకి ఎక్కించారు. చివరి పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. గతేడాది మాదిరిగానే ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం ముందుగా పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఎలాంటి ఆటంకం కలగకుంగా ప్రణాళిక రూపొదించారు.
55 టన్నుల బరువు మోయగల క్రేన్ ఈ ఏడాది ఖైరతాబాద్‌లో ద్వాదశ ముఖ లంబోదరుడిని ఏర్పాటు చేశారు. అశేష భక్తజన కోలాహలం మధ్య ఖైరతాబాద్ గణేషుడి యాత్ర సుమారు 7 గంటల పాటు సాగింది. వివిధ కళారూపాలు, పోతురాజుల విన్యాసంతో గణేషుడి యాత్ర ఆద్యంతం కోలాహలంగా సాగింది.గురువారం ఉదయం ప్రారంభమైన గణనాథుడి శోభయాత్రతో భాగ్యనగర వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. నెక్లెస్‌ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన క్రేన్‌ వద్దకు చేరుకున్న గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత స్వామి వారి కలశాన్ని ఉత్సవ సమితి సభ్యులు నిమజ్జనం చేశారు. అనంతరం దాదాపు 50 టన్నుల బరువున్న భారీ గణనాథుడి నిమజ్జనం పూర్తి చేశారు.గణపతిబొప్ప మోరియా నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మార్మోగిపోయాయి. గతేడాది నుంచి అధికారులు ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనాన్ని మొదట పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత శోభాయాత్రలో తరలివచ్చే వినాయకులను నిమజ్జనం చేస్తున్నారు.. ఈ క్రేన్‌ను ఆపరేటర్ చేసిన డ్రైవర్‌ దేవేందర్‌ సింగ్‌ గతేడాది కూడా నిమజ్జనంలో పాల్గొన్నారు.ఇక బడా గణపతిని తరలించడానికి వాడుతున్న ట్రాలీ 55 టన్నుల బరువును సునాయాసంగా తీసుకెళ్లగలుగుతుంది. ఎస్టీపీకి చెందిన ఈ ట్రాలీని 20 ఏళ్లుగా దీనికి వినియోగిస్తున్నారు. ఇది 70 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ ట్రాలీకి 26 టైర్లు ఉంటాయి. ఈ ట్రాలీ డ్రైవర్‌ భాస్కర్ రెడ్డికి విశేష అనుభవం ఉంది. తాజా నిమజ్జనంతో కలిపి ఇప్పటి వరకు ఆయన 7 పర్యాయాలు శోభాయాత్రలో ట్రాలీ నడిపారు.

Related Posts