Highlights
- ప్రియా ప్రభావం తనపై పడింది
మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ ను అనుకరిస్తూ కన్ను గీటిన వారి జాబితాలో మరో సెలబ్రిటీ చేరింది. ప్రముఖ గాయని నేహా కక్కర్ కూడా చేతి వేళ్లకు ముద్దు పెట్టి తుపాకీలా గురి పెడుతూ కన్నుగీటుతూ ప్రియా వారియర్ లా చేసింది. ప్రియా వారియర్ ప్రభావం తనపై పడిందని, కాకపోతే గన్ను ఉల్టా అయిపోయిందని పేర్కొంటూ ఆమె సరదాగా ఈ దృశ్యాలను తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసింది.
ప్రియా వారియర్ కన్ను గీటుతూ కనపడిన వీడియో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఒక్క వీడియోతోనే ఆమె ఇంటర్నెట్ లో పెద్ద స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఆమెను సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇక ఆమెను అనుకరిస్తూ సోషల్ మీడియాలో సెలబ్రిటీలు కూడా వీడియోలు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.