విత్తన రంగంలో తెలంగాణ భేష్
హైదరాబాద్ సెప్టెంబర్ 13,
తెలంగాణా రాష్ట్రం విత్తన రంగంలో చేపడుతున్న విప్లవాత్మాక విధానాలను ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రజ్ఙడు. హరిత విప్లవ పితామహుడు డాక్టర్ స్వామినాధన్ ప్రశంసించారు. తెలంగాణా రాష్ట్ర విత్తన సంస్థల ఎండి అంతర్జాతీయ విత్తన సంస్థ ఉపాద్యక్షుడు డాక్టర్ కేశవులు శుక్రవారం సామినాధన్ ఫౌండేషన్ ఆహ్వానం మీద చెన్నై లో ఆయనను కలుసుకున్నారు. డాక్టర్ కేశవులు ఇస్టా ఉపాధ్యాక్షుడు గా ఆసియాలోనే తొలిసారిగా ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక అయినందుకు డాక్టర్ స్వామినాధన్ ఆయనను పిలిపించి విత్తన రంగంలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పరిణామాలు, సమస్యల గురించి చర్చించారు. ఈ సందర్భంగా వ్యసాయ రంగం లో విత్తనం ప్రదాన భూమికను పోషిస్తుందని విత్తనాల నాణ్యత, రైతులకు సరఫరా, ప్రమాణాలు విషయంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు వస్తున్నాయి. అయితే వీటికి అనుగుణంగా మనదేశం స్పందించి పరిశోదనా రంగంలో ఇంకా పురోగమించవలసిన అవసరం వుందని స్వామినాధన్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ పరిశోదనలలో కేంద్ర ప్రభుత్వాలు విత్తన రంగానికి కూడా దినికిగక్ ప్రధాన్యత ఇవ్వలేకపొవడం దుర దృష్టకరమనీ అన్నారు. రైతుకు కావలసినది విత్తనం. దీనినే నిర్లక్ష్యం చేస్తే వ్యవసాయం రంగం పురోభివృద్ది అసంపూర్ణంగానే మిగిలిపోతుందని డాక్టర్ స్వామినాధన్ అభిప్రాయపడ్డారు.