YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మంకీ పుడ్ కోర్టులతో  కోతుల ఇబ్బందులు దూరం.

మంకీ పుడ్ కోర్టులతో  కోతుల ఇబ్బందులు దూరం.

మంకీ పుడ్ కోర్టులతో  కోతుల ఇబ్బందులు దూరం.
 రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 
జగిత్యాల సెప్టెంబర్ 13  
మంకీ ఫుడ్ కోర్టుల ద్వారా కోతుల నుండి ఇబ్బందులు దూరమవుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.జగిత్యాల మండలం కల్లెడ గ్రామoలో మంకీ ఫుడ్ కోర్ట్ ను శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోతుల ఆహారం కోసం ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్ పథకం వల్ల రైతులకు, గ్రామాలలో ప్రజలకు ఇబ్బందులు పెట్టకుండా కోతులు ఆహారాని ఏర్పాటు చేయడాన్ని ఇక్కడి అధికారులను ప్రజాప్రతినిధులను అభినందించారు.ఇంతకు ముందు ఒక్క సిద్దిపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు.కానీ కల్లెడలో 100 ప్లాట్లు సుమారు 20లక్షల మొక్కలను నాటారని,కల్లెడ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో మల్టీ కోర్ట్ లు ఏర్పాటు చేయాలని కోరారు.రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో అన్ని రాజకీయ పార్టీలు పార్టీలకు అతితంగా ముందుకు రావాలని కోరారు.ప్రజా ప్రతినిధులు అధికారులు కొంత ఇబ్బందులు ఎదురైనా ముందుకు సాగాలని కోరారు.ముఖ్యమంత్రి అన్ని గ్రామాలు,పట్టణాలు బాగుండాలని 30 రోజుల ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని వివరించారు.అన్ని శాఖల అధికారులు,మండల, గ్రామ, ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.

Related Posts