YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

రోటా వైరస్ వ్యాక్సిన్ తో పిల్లలు సురక్షితం - రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 

రోటా వైరస్ వ్యాక్సిన్ తో పిల్లలు సురక్షితం - రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 

రోటా వైరస్ వ్యాక్సిన్ తో పిల్లలు సురక్షితం - రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 
జగిత్యాల  సెప్టెంబర్ 13
పిల్లల్లో వచ్చే స్వల్పకాలిక జ్వరం వాంతులు, విరేచనాలకు రోటా వైరస్ వ్యాక్సిన్ సురక్షితమని,  డయేరియా   నిర్మూలన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రోటా వైరస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాల ఆవరణలో జరిగిన వ్యాక్సినేషన్  
ప్రారంభోత్సవ  కార్యక్రమానికి పంచాయతీరాజ్ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు సంక్షేమ శాఖ మంత్రి జిల్లా పరిషత్ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు  ప్రత్యేక  శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్ సూచించారు. ఈసందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ ఈ ఏడాది లోపు ఉన్న పిల్లలందరికీ మూడు డోసులు 6 వారాలకు ,10 వారాలకు మరియు14 వారాలకు ఈరోటా వైరస్ వ్యాక్సిన్ తీసుకునేలా గ్రామాల్లో వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని తెలిపారు. రెండు సంవత్సరాల లోపు పిల్లల్లో రోటా వైరస్ వచ్చే డయేరియా 75 శాతం పిల్లలు    మరణిస్తున్నారని, పిల్లల్లో విరేచనాలు నివారణకు ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చిందని దీన్ని జగిత్యాల జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈకార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ సమియోద్దిన్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీపతి, జిల్లా ఉప 
వైద్యాధికారి జైపాల్ రెడ్డి, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులు సూపర్వైజర్లు,డిపిఓ రాజేందర్,డివిఎల్ ఎం నదీమ్ ,డెమో రమణ ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts