YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమర్జనం - సిబ్బందిని అభినందించిన ఎస్ పి రాహుల్ హెగ్డే

ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమర్జనం - సిబ్బందిని అభినందించిన ఎస్ పి రాహుల్ హెగ్డే

ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమర్జనం - సిబ్బందిని అభినందించిన ఎస్ పి రాహుల్ హెగ్డే
సిరిసిల్లవేములవాడ  సెప్టెంబర్ 13  
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్ పి రాహుల్ హెగ్డే నేతృత్వంలో వినాయక నిమర్జన శో యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి తావు ఇవ్వకుండా, భక్తులకు వీక్షకులకు ఎలాంటి ఇబ్బందులు తావేత్తకుండా   మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, వైద్య, అగ్ని పలు శాఖల   సహకారంతో జిల్లాలో వినాయక శోభాయాత్ర ఆనందోత్సాహాల మధ్య ప్రశాంతంగా ముగిసింది. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండగా పకడ్బందీ బందో బస్తు ను ఏర్పాటు చేసి వినాయక శోభ యాత్రను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు.  శోభయాత్ర అంతా సి సి కెమెరాల నిఘాలో కొనసాగగా, డ్రోన్ కెమెరా ద్వారా నిమజ్జన ప్రదేశ పర్యవేక్షణ కొనసాగింది. సిరిసిల్లపట్టణంలో  జరిగిన  వినాయక  శోభ యాత్ర లో బందోబస్తు కోసం 126 మంది పోలీసు సిబ్బంది ని కేటాయించగా వారి వారి విధులు బాధ్యతాయుతంగా పూర్తి చేసారు, ఇందులో పట్టణ ప్రజల సహకారాలు కూడా అభినందనీయం. గతంలో ఎదురైన పలు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ముందస్తు గా ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆధునిక సాంకేతికత అయిన జియో ట్యాగింగ్ ని జోడించి ప్రతి వినాయక ప్రతిమ యొక్క పూర్తి సమాచారం తో ట్రాఫిక్ వ్యవస్థ క్రమబద్దీకరిస్తూ, వాహనాల రాకపోకలకు, జన సంచారనికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పలు సెక్టార్ల గా విభజించి నిమజ్జన ప్రదేశానికి చేరు వరకు శోభాయాత్ర ప్రశాంతంగా ముందుకి సాగేలా ఏర్పాట్లు చేశారు. సిరిసిల్ల డివిజన్ లో 1109 వినాయక ప్రతిమ లు, వేములవాడ డివిజన్ లో 761 వినాయక ప్రతిమలు శోభాయాత్ర విజయవంతం గా ముగిసింది.  జిల్లాలో ఉన్న వినాయక  మండపాల వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసుకొని నవరాత్రులు బ్లూ కోల్ట్ , పెట్రోలింగ్ బృందాలు నిఘాలో ఉంచడం జరిగింది. వినాయక శోభ యాత్రలో ప్రతి ఒక్కరి సమిష్టి కృషితో ఎటువంటి అవాంతరాలు లేకుండగా మొత్తం 1870 వినాయక శోభాయాత్ర ప్రశాంతంగా ముగియటంలో కృషి చేసిన పోలీసు సిబ్బంది ని అభినందిస్తూ, తమ అమూల్యమైన సహకారాలు అందజేసిన ఇతర శాఖల వారికి, వినాయక   కమిటీల వారికి జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Posts