YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కర్నూలు, సెప్టెంబర్ 13, 
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం  వయెవృధ్ధులు,  విభిన్న ప్రతిభావంతులకు అనేక రకాల ఉపకరణాల పంపిణీ, పెన్షన్లు  తదితర సహాయ సహకారాలు అందిస్తోందని ప్రభుత్వం అందించే సహాయాన్ని  సక్రమంగా సద్వినియెగం చేసుకుని ఆరోగ్యాన్ని పరిక్షించుకోవాలని రాజ్య సభ్యుడు  టి.జి.వెంకటేశ్  పేర్కొన్నారు.  శుక్రవారం కలెక్టరేట్ లోని సునయన అడిటోరియంలో భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన అలీమ్ కో సంస్థ సౌజన్యంతో  ఏర్పాటు చేసిన వయెవృద్దుల సహాయ పరికరాల పంపిణీ  కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.  ఇంచార్జి కలెక్రర్ రవిపట్టన్ శెట్టి, జాంయిట్ కలెక్టర్-2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్, డిఆర్ ఎ డి పిడి శ్రీనివాసులు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఎడి భాస్కర్  రెడ్డి,  అలీమ్ కో ప్రతినిధి పరిమళ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  రాజ్యసభ సభ్యులు టి.జి.వుంకటేశ్ మాట్లాడుతూ జన్మత:  ఎవరూ వికాలంగులు కారని పోలియో, చెడు అలవాట్టు, ప్రమాద వశాత్తు,  పోషకాహార లోపం వల్ల దివ్యాంగత్వం ఏర్పడుతుందని  ఆందోళన చెందకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు.  వయోవృద్దులు తెల్లబియ్యాని ఆహారంగా తీసుకోకుండా బలం కలిగించే రగులు, జొన్నలు,కోర్రలు రాయలసీమలో పండే ఆహారపదార్ధాలను  ఆహారంగా తీసుకుంటూ జబ్బులకు దూరంగా ఉండాలని సూచించారు. 70 సంవత్సరాలు దాటిన వ్యక్తులు భయంకరమైన జీవితాన్ని అనుభవిస్తుంటారని ఎవరికి వారు తమ 
అరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.   ఇంచార్జి కలెక్టరు రవిపట్టాన్ శెట్టి మాట్లాడుతూ వయోవృద్దులకు అవసరమయ్యే సహాయ పరికరాల పంపిణీ లో  కొంత ,ఆలస్యం జరిగిందన్నారు. అలిమ్ కో సంస్థతో వికలాంగుల సంక్షేమ శాఖ సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ఎంపిక చేసిన వయోవృద్దులకు సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నామన్నరు. వయోవృద్ధులకు పంపిణీ చేసే వివిధ పరికరాల వినియోగం పై సంబంధిత నిపుణులచే శిక్షణ తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం  అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై  పూర్తి  అవగాహన పొంది  గ్రామాల్లోని ప్రజలకు తెలియజేయాలన్నారు. అనంతరం 460 మందికి కంటి అద్దాలు, 132 మందికి వీల్ చైర్లు, 242 మందికి వాకర్స్,  168 మందికి ముక్కాలి పీటలు, 381 మందికి వాకింగ్ స్టిక్స్, 28 మందికి  చంక కర్రలు, 75 మందికి ట్రై ట్రాపాడ్ లు, 520 మందికి శ్రవణ యంత్రములు  మొత్తం రూ 32,82,000  విలువగల 2079 సహాయ పరికాలను రాజ్యసభ సభ్యులు, ఇంచార్జీ కలెక్టరు తదితరులు పంపిణీ  చేసారు.

Related Posts