నెట్టెంపాడు ఆర్ డి ఎస్ కాలువలకు నీళ్లు వదలి అలంపూర్ రైతాంగాన్ని ఆదుకోవాలి
- కాంగ్రెస్ నేతలు
జోగులాంబ గద్వాల సెప్టెంబరు 13
అల్లంపూర్ నియోజకవర్గానికి సాగునీరు అందించే నెట్టెంపాడు ప్రాజెక్టులో అంతర్భాగమైన ముచోనిపల్లి, తాటికుంట, నాగర్ దొడ్డి ,మినీ రిజర్వాయర్ లలో నీరు లేక పొట్టి పోతుండగా, రోమ్ నగరం కాలిపోతుంటే ఫిడేలు వాయించిన రాజు చందంగా అల్లంపూర్ ఎమ్మెల్యే అబ్రహం గారు చూస్తూ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఉమ్మడి జిల్లా ప్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇ పోతుల మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గద్వాల నియోజకవర్గంలో ఎలాంటి రిజర్వాయర్ లేకున్నా కాలువల ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందే వీలుంది అందుకై గద్వాల ఎమ్మెల్యే గారు తన నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనాలు కాపాడేందుకు కుంటలు చెరువులు నింపుతూ అలంపుర్ ప్రాంతానికి సాగునీరు అందించే మినీ రిజర్వాయర్ లకు నీరు రాకుండా చూస్తున్నారన్నారు. ఒకవైపు కృష్ణానది నుండి వందలాది టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రాంతానికి తరలి పోతుండగా, ఈ ప్రాంతానికి సాగునీరు అందించే విధంగా చర్యల తీసుకోకపోవడం శోచనీయమన్నారు . ఇక ఆర్ డి ఎస్ కాలువ విషయానికొస్తే తుంగభద్రా నది నుంచి వందలాది టీఎంసీల నీరు రాయలసీమ వైపు తరలి పోతుందని కానీ అలంపూర్ నియోజకవర్గంలోని దాదాపు 85 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ కాలువ ఈ కార్యక్రమంలో ఖరీఫ్ సీజన్లో పట్టుకొని పట్టుమని పది రోజులు కూడా వాడిన దాఖలాలు లేవని అన్నారు. తుమ్మిళ ఎత్తిపోతల పథకం కేవలం అలంకార ప్రాయం అని అది కాంట్రాక్టర్లకు ప్రజాప్రతినిధులకు బంగారు గుడ్లు పెట్టే బాతు పథకం అని ఆయన ఆరోపించారు. గత ఐదారు సంవత్సరాలుగా ప్రతిఏటా కరువు వాన బారిన పడుతున్న ఆర్డీఎస్ రైతాంగానికి ఆర్ డి ఎస్ తుమ్మిళ్ళ పథకాల వల్ల ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు.
ఐజ మండలానికి పై వైపున ఉండే మూడు మినీ రిజర్వాయర్ ల వల్ల వేలాది ఎకరాలకు సాగునీరు అందే వీలుంది, ఈ మూడు రిజర్వాయర్లు నిండితే వీటికి అనుసంధానంగా చాలా కుంటలు చెరువులు నిండి భూగర్భ జలాలు పెరిగి ఆరోగ్యంగా పరోక్షంగా బోరుబావులు కూడా మెరుగవుతాయని అన్నారు. ఇవన్నీ కూడా అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం గారికి తెలియదని మేము భావించడం లేదు, కేవలం ఆదాయం ఉండే లేదా వచ్చే వనరుల పైనే ఎమ్మెల్యే దృష్టి అనే భావన ప్రజల్లో పడకుండా ఉండాలంటే వెంటనే మూడు రిజర్వాయర్ లకు నెట్టెంపాడు ప్రాజెక్టు ఇళ్లను తరలించాలని తద్వారా అలంపూర్ నియోజకవర్గ రైతులకు మేలు చేసే విధంగా చూస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శిక్షావలి ఆచారి, నవత చంద్రశేఖర్ రెడ్డి, మైనర్ బాబు, మహిళా నాయకురాలు రాణమ్మ, తిప్పన యాదవ్, సాంబశివుడు,గిత్తల దేవరాజ్, దేవేందర, నేసే కొండ తదితరులు పాల్గొన్నారు