YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*భక్తి ఫలం - జ్ఞానం*

*భక్తి ఫలం - జ్ఞానం*

*భక్తి ఫలం - జ్ఞానం*

*????భక్తి సంపూర్ణం అయినవారు భక్తికి ఫలంగా జ్ఞానాన్ని పొందుతారు.*

*????ఎవరైతే ఆదిలో భక్తిని ఆరంభించారో వారు తమ భక్తిని పూర్తి చేసుకుని, నేడు జ్ఞానలబ్ధిని పొందుతున్నారు.*

*????ద్వాపరమందు దేహభావనలోకి వస్తూ..ఏదో తెలియని అశాంతి అనుభవం అయితే..దాని నుండి ముక్తమయ్యేందుకు భక్తిని ప్రారంభించడం జరిగింది.*

*????సత్యయగీ ఆదిలో ఉన్న దేవాత్మలే, ద్వాపరంలో మొదట శివుని పూజతో సతోప్రధాన భక్తిని ప్రారంభించారు.తదుపరి తమ ఆది పూజ్య రూపాలను కూడా పూజించడం మొదలు పెట్టారు.*

*????తరువాత వచ్చిన వారు ఆ భక్తిని కొనసాగిస్తూ, మెల్ల మెల్లగా.. సత్యత్రేతాయుగాలలో పాత్రను అభినయించిన ముక్కోటి దేవతలను పూజింపనారంభించారు.*

*????తదుపరి గురువులను ప్రకృతిని,శక్తులను,పశుపక్ష్యాదులను పూజిస్తూ..చివరకు అణువణువులో,అందరిలో భగవంతుడు ఉన్నారనుచు...నేటికి భక్తి పూర్తి తమోప్రధానమైపోయింది..!*

*????మనిషి యొక్క మనోస్థితి ఏవిధంగా అంచెలంచెలుగా దిగజారుతూ వచ్చిందో..భక్తి భావన,విధివిధానం కూడా అదే విధంగా మారుతూ నేటి స్థితికి చేరుకుంది..!*

*????సృష్టి ఆదిలో వచ్చిన దేవాత్మలే, భక్తిని ప్రారంభించారు..! వారే నేడు భక్తిని పూర్తి చేసుకుని దాని ఫలంగా పరమాత్ముని నుండి జ్ఞాన ఫలాన్ని పొందుతున్నారు..!*

*????జ్ఞానం ఆధారంగా మరల పుణ్య ప్రారబ్ధాన్ని తయారు చేసుకుని, మరల నూతన సృష్టి చక్రంలో ఆదిలో వచ్చే దేవాత్మలుగా అవుతారు..!*

*????భక్తిలో ఎవరైతే హృదయపూర్వకమైన సత్యమైన భావన కలిగి ఉండేవారో..వారు జ్ఞాన సాగర లోతుల్లోకి వెళ్లి సూక్ష్మ విషయాలను కూడా అవగతం చేసుకుంటూ..జ్ఞాన రత్నాలతో ఆడుకుంటున్నారు..!*

*????భక్తిలో భావన కంటే నియమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినవారు..జ్ఞాన సాగరాన పైపైనే తేలియాడుతూ అంతటితోనే సంతృప్తి చెందుతున్నారు.*

*????భక్తిలో నామమాత్రపు ప్రదర్శిత భక్తి చేసినవారు.. జ్ఞాన విషయాలు వినుటలోనే తృప్తిని చెందుతూ జ్ఞాన సాగరాన్ని దూరం నుండే చూస్తున్నారు కానీ ధారణకు నోచుకోలేకపోతున్నారు..!*

*????ఈవిధంగా జ్ఞాన ధారణలో నెంబర్ వారీగా ఉన్నారు. అంటే భక్తిలో భావనకు తగు ఫలం జ్ఞానంలో పొందుతారు,జ్ఞానానికి తగు ప్రారబ్ధము తదుపరి కల్పానికి తీసుకువెళ్తారు..!*

*????డ్రామా విచిత్రమైనది. విభిన్న పాత్రలు...ప్రతీ పాత్రలో ఓ ప్రత్యేకత..! త్రికాలదర్శులమై ప్రతి పాత్రను సాక్షిగా చూస్తూ..మన పాత్రపై ధ్యాస పెట్టాలే కానీ..సరి పోల్చుకుంటూ ఈర్ష్యకు,అహంకారానికి గురి కాకూడదు..!*

*????ఓం శాంతి????*????????????????????????????????????????????????????????????????????????

Related Posts