
కారు బోల్తాపడి మంటలు…ఐదుగురు సజీవ దహనం
చిత్తూరు సెప్టెంబర్ 14,
చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలంలోని మామడుగు వద్ద వేగంగా వెళ్ళుతున్న కారు బోల్తా పడటం తో కారులో మంటలు చెలరేగి 5గురు మృతి చెందారు. తిరుపతి నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారులో ఒక్కసారి మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు మంటల్లో కాలి బూడిదయ్యారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ముగ్గరు పెద్దలు, ముగ్గురు పిల్లలు వున్నారు. టిటిడి లో జూనియర్ అస్సిటెంట్ గా పనిచేస్తున్న విష్ణు బతికి ఉన్నారు. కారులో విష్ణుతో పాటూ విష్ణు భార్య, కూతురు, కొడుకు, చెల్లెలు,చెల్లెలు కూతురు ఉన్నారు. విష్ణు గాయాలతో బయటపడగా, మిగిలిన 5 మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో విష్ణు భార్య జాహ్నవి, కుమారుడు పావన్ రామ్, కుమార్తె సాయి ఆశ్రీత, విష్ణు చెల్లెలు కళ ఆమె కుమారుడు భాను తేజలు మృతిచెందారని పోలీసులు తెలిపారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.