చత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్..ఇద్దరు మావోయిస్టులు మృతి
రాయ్ పూర్ సెప్టెంబర్ 14,
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడలో అడవుల్లో శనివారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారుమృతి చెందిన ఒక్కో మావోయిస్టుపై లక్ష రివార్డు ఉన్నట్లు సమాచారం. జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ మాట్లాడుతూ.. దంతెవాడ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా భద్రతా బలగాలు కూంబింగ్ ప్రారంభించాయని తెలిపారు. కుంత్రేమ్ గ్రామానికి దగ్గరలో పోలీసులు రావడంతో అక్కడ మాటు వేసిన మావోలు ఒక్కసారిగా దాడిచేశారు. దాంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు రెండు గంటలపాటు కాల్పులు జరిగిన తరువాత మావోలు పారిపోయారు. . కొన్నిగంటల అనంతరం మావోలవైపు నుంచి కాల్పులు ఆగిపోయాయని చెప్పారు. దీంతో ఈ ప్రాంతాన్ని పరిశీలించగా, ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులిద్దరూ స్థానిక మలంగీర్ ఏరియా కమిటీ సభ్యులనీ, వీరి తలపై చెరో రూ.5 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.