జగన్ ప్రభుత్వం వైఫల్యం - జనసేన నివేదికలో పవన్ కళ్యాణ్
గుంటూరు సెప్టెంబర్ 14,
ఏపీలో వైకాపా ప్రభుత్వం వంద రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదికని శనివారం విడుదల చేసింది. ఈసందర్భంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో పారదర్శక, దార్శనికత లోపించిందని విమర్శించారు. . ప్రణాళికాబద్ధంగా, నిర్మాణాత్మకంగా పని చేయాలని జనసేన సూచించించారు. సీజనల్ వ్యాధుల నివారణలో సన్నద్ధత లోపించిందన్నారు. వరద పరిస్థితుల అంచనాలో పాలనా యంత్రాంగం నిస్తేజంగా వ్యవహరించిందన్నారు. పునరావాస చర్యల్లోనూ పాలనా యంత్రాంగం నిస్తేజంగా వ్యవహరించిందన్నారని ఆరోపించారు. మంత్రి బోత్స సత్యనారాయణపై పవన్ విరుచుకుపడ్డారు. మంత్రి సొంత ఆస్తులను అమ్మి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారా అని ప్రశ్నించారు. ఉన్న పెట్టుబడిదారులనే పంపించేస్తే కొత్త వాళ్లు ఎక్కడి నుంచి వస్తారని నిలదీసారు. పెట్టుబడులను ఆకర్షించడంతో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసి, గందరగోళం సృష్టించారని పవన్ మండిపడ్డారు. కియా పరిశ్రమ సీఈవోను కూడా అవమానించారని చెప్పారు. పరిపాలన ఈ విధంగా కొనసాగితే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు. పెట్టుబడిదారులను ఎవరైనా బెదిరిస్తారా? అని అడిగారు అమరావతిపై టీడీపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని మంత్రి బొత్స వ్యాఖ్యానించారని... అది టీడీపీ చేతకానితనం అనుకుందామని... ఇప్పుడు మీరు ఇవ్వండని తాను డిమాండ్ చేస్తున్నానని పవన్ చెప్పారు.
రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీని కూల్చింది ఇసుక మాఫియానే అని పవన్ అన్ఆరు. . ఇసుక మాఫియాను అరికట్టడంలో వైసీపీ విఫలమైందన్నారు. ఇసుకే లేకుండా చేశారని పవన్ అన్నారు.వంద రోజుల్లో ఇసుక పాలసీనే తీసుకురాలేకపోయారని విమర్శించారు.