YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పారిశుద్ధ్య పనులు వేగవంతం

పారిశుద్ధ్య పనులు వేగవంతం

పారిశుద్ధ్య పనులు వేగవంతం
మహబూబ్ నగర్ సెప్టెంబర్ 14, 
ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కావడానికి వీల్లేదని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ అధికారులను ఆదేశించిన పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ రోనాల్డ్ రోస్ తో కలిసి మహబూడ్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి డెంగ్యూ నివారణకు చేపట్టాల్సిన చర్యల పై మార్గదర్శనం చేశారు. ఈ 
సందర్భంగాక్షేత్రస్థాయిలో డెంగ్యూ నివారణ చర్యలకు కదిలిన సిబ్బంది ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.  మున్సిపల్ సిబ్బంది వారం రోజుల్లో లో పట్టణం మొత్తం డెంగ్యూ పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. ఏ ఇంటి దగ్గర అయినా నిర్లక్ష్యంగా  మంచి నీటి నిలువలు ఉండి ఉంటే అలాంటి వాటిని పారబోయలని  సూచించారు. తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని పట్టణ వాసులకు పదే పదే గుర్తు చేయాలన్నారు.  డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందే విధానాన్ని ఇంటింటికి వెళ్లి వివరించి,   డెంగీ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించే కరపత్రాన్ని ఇంటి తలుపు కు అంటించాలన్నారు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోనే అత్యధికంగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి చెత్త సేకరణ వాహనాలను తీసుకువచ్చామని వాటిని పూర్తిస్థాయిలో వినియోగించాలని  అధికారులను ఆదేశించారు.. వారం రోజుల తర్వాత ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. డెంగ్యూ వ్యాధి నివారణ ప్రభుత్వ బాధ్యత ఒక్కటే కాదని 
పౌరులు కూడా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించి డెంగ్యూ నివారణలో కలిసి రావాలన్నారు. తరువాత మంత్రి మున్సిపల్ కార్యాలయం నుండి అశోక్ టాకీస్ చౌరస్తా వరకు పారిశుద్ధ్య చర్యలు పరిశీలించారు. రహదారులపై నిల్వ ఉన్న నీటిలో స్వయంగా మంత్రి దోమల నివారణ మందు స్ప్రే చేశారు. 

Related Posts