ఆశ్రమ పాఠశాలలపై అసెంబ్లీలో చర్చ
హైద్రాబాద్, సెప్టెంబర్ 14,
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సెప్టెంబరు 9 పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ అనంతరం వాయిదా పడిన శాసనసభ సమావేశాలు శనివారం నుంచి పునః ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు సెప్టెంబరు 22 వరకు నిరాటంకంగా కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి మొదలయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఆశ్రమ పాఠశాలలు, ఐటీ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, జీహెచ్‌ఎంసీలో మురుగునీటి శుద్ధికేంద్రాల సామర్థ్యం పెంపు, సంచార పశువైద్యశాలలు, హైదరాబాద్‌లో రూ.5 భోజన కేంద్రాల పెంపు, గొర్రె పాకల మంజూరు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనం, వ్యవసాయ వాహనాలపై పన్ను మినహాయింపు, కల్యాణలక్ష్మి పథకాలపై సభ్యుల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనున్నది. తొలుత ఐటీ, పురపాలిక మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.జీహెచ్‌ఎంసీ పరిధిలో మురుగునీటి శుద్ధి కేంద్రాల సామర్థ్యం పెంచుతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో చెత్త సేకరణ, మురుగునీటశుద్ధీకరణ మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. మరింత మెరుగ్గా పని చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశామని, జీహెచ్‌ఎంసీ పరిధిలో మురుగునీటి శుద్ధీకరణ కోసం 21 ప్లాంట్లు పని చేస్తున్నాయని మంత్రి తెలిపారు. 2021 నాటికి వీటిని రెట్టింపు చేస్తామని, హైదరాబాద్‌లోని 54 శాతం డ్రైనేజీ నీరు మూసీ నదిలో కలుస్తోందన్నా. దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం జీరో అవర్ ఉంటుంది. ఇటీవల మృతి చెందిన కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రులు చెరుకు ముత్యంరెడ్డి, ముఖేశ్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే సోమగోపాల్‌కు సభ సంతాపం తెలిపారు. తర్వాత రాష్ట్ర సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్‌పై చర్చ మొదలవుతుంది. బడ్జెట్‌పై అన్ని పార్టీల సభ్యులు ప్రసంగించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సమాధానమిస్తారు.