YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా రాలేదు

కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా రాలేదు

కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా రాలేదు
హైద్రాబాద్, సెప్టెంబర్ 14, 
గడిచిన ఐదేళ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపు చేశామని ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఐటీ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ రూ. 52 వేల కోట్లు కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి వంద శాతానికి పైగా పెరిగి లక్షా 10 వేల కోట్ల రూపాయాలకు చేరుకోవడం తెలంగాణ సాధించిన అద్భుత విజయానికి నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో మహబూబ్‌నగర్‌లో కూడా ఐటీ టవర్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. యూపీఏ పదవీకాలం ముగుస్తున్న సమయంలో ఐటీఐఆర్‌(ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌) పాలసీని తీసుకువచ్చింది.ఐటీఐఆర్‌ పాలసీ కింద యూపీఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఐటీఐఆర్‌ కొత్త ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. కేంద్రానికి దాదాపు పదిసార్లు నేరుగా కలిసి అడిగాం. లేఖలు రాశాం. నాటి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వనందుకే ఐటీఐఆర్‌ ఇవ్వలేదని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖలను ఆ మరుసటి రోజే దత్తాత్రేయకు చూపించాం. మా పాలసీ ఐటీఐఆర్‌ కాదు. దాన్ని ముందుకు తీసుకెళ్లాం అని నాటి కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. బెంగళూరుకు, హైదరాబాద్‌కు మంజూరు చేశారు కానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.వారు ఇవ్వకపోయినంతా మాత్రాన ఐటీ అభివృద్ధి ఆగలేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పాలసీలతో తెలంగాణలో 17 శాతం వృద్ధిని ఐటీ రంగంలో సాధించాం. ఉత్తర, దక్షిణ హైదరాబాద్‌లో కూడా ఐటీని ప్రోత్సహిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నలువైపులా ఐటీ కంపెనీలను విస్తరిస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. కరీనంగర్‌లో రాబోయే నెలలో ఐటీ టవర్‌ను ప్రారంభించబోతున్నామని చెప్పారు. మహబూబ్‌నగర్‌ ఐటీ టవర్‌కు టెండర్‌ పూర్తయింది. 50 ఎకరాల స్థల సేకరణ జరిగింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా బీపీవో సంస్థలు ప్రారంభం అయ్యాయని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు

Related Posts