YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

కోమటిరెడ్డిపై వేటు..? 

Highlights

  • పునర్దర్శనం వచ్చే అసెంబ్లీలోనే..?! 
కోమటిరెడ్డిపై వేటు..? 

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కె రోజాకు పట్టినగతే  ఇప్పుడు తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంటక రెడ్డికి పట్టబోతోంది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు జరిగిన ఘటనపై కేసీఆర్ ప్రభుత్వం చంద్రబాబు ఫార్ములాను అనుసరించబోతుంది.  
గతంలో టీఆర్ఎస్ సభ్యులు చేయలేదా..? టీడీపీ సభ్యులు చేయలేదా..? ఏదో నాలుగు కాగితాలు చింపి గవర్నర్ వైపు విసిరితే, దాంతోపాటు హెడ్ ఫోన్లు ఎగిరిపోయి ఉంటాయి… స్వామిగౌడ్‌కు తగిలి ఉంటాయి… గతంలో ఇదే గవర్నర్ పట్ల హరీష్ రావు ఏం చేశాడో గుర్తులేదా..? రైతుల గురించి చర్చ జరగాలనే ఎమోషన్‌లో ఏదో కోమటిరెడ్డి కాస్త తొందరపడి ఉంటాడు…… ఇదుగో ఇలా ఏం చెప్పినా, ఎన్ని చెప్పినా సదరు కోమటిరెడ్డి చర్యను కాంగ్రెస్ పార్టీ సమర్థించుకోవడం కష్టం… నిజానికి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ముందస్తు ప్లాన్‌తోనే కాంగ్రెస్ వ్యవహరించింది… అగ్రెసివ్ స్టాండ్… ఈ ఉప్పందిన కేసీయార్ నిన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మీటింగులోనూ దీన్ని చెప్పాడు… అందుకే, ఎవరు అతిగా ప్రవర్తించినా నిషేధిస్తామంటూ హెచ్చరిక జారీ చేశాడు… అఫ్ కోర్స్, ఇదే అసెంబ్లీ, ఇదే గవర్నర్ ఇంతకన్నా బీభత్స దృశ్యాలకు సాక్షులు… విభజన ఉద్యమాల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు ఇంతకుమించి వీరంగమే సృష్టించారు… కానీ టైం, సందర్భం…? అధికారపక్షం ఎవరు దొరుకుతారా అన్నట్టుగా చూస్తున్నవేళ, మరీ కౌన్సిల్ చైర్మన్ గాయపడే స్థాయిలో ‘అల్లరి’ కనిపించడంతో ఇక ఉపేక్షించకపోవచ్చు…
 

‘‘కోమటిరెడ్డిపై లైఫ్‌టైం బ్యాన్ పెడతారట కదా…’’ ఈ సందేహం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బలంగా వ్యాప్తి చెందింది… కానీ లైఫ్ టైమ్ నిషేధం సాధ్యం కాకపోవచ్చు… ఎందుకంటే ఈ స్పీకర్ అధికార పరిధి గానీ, ఈ ప్రివిలేజ్ కమిటీ అధికార విస్తృతి గానీ ఈ అసెంబ్లీకే పరిమితం… అంటే మరో ఏడాది… ఒకవేళ ప్రివిలేజ్ కమిటీ గనుక సీరియస్ చర్యను రికమెంట్ చేస్తే బహుశా ఓ ఏడాదిపాటు నిషేధాన్ని విధిస్తారేమో…? ఏపీ అసెంబ్లీకి సంబంధించి రోజాపైనా స్పీకర్ కోడెల ఏడాది నిషేధం విధించాడు… దీనిపై ఆమె కోర్టు మెట్లు ఎక్కి, ఎంత పోరాడినా ఫలితం లేదు… ఉండదు కూడా…! అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులపై ఎవరైనా సభ్యుడిపై స్పీకర్ ఒక నిర్ణయం తీసుకుంటే ఇక అది ఫైనల్… కోర్టులు పెద్దగా జోక్యం చేసుకోవు… చట్టసభల అధికారాల్లోకి, అంటే స్పీకర్ల అధికార పరిధుల్లోకి ఎంటర్ కావటానికి ఇష్టపడవు కూడా…! సో, ఒకవేళ కోమటిరెడ్డిపై గనుక నిజంగానే ఏడాది నిషేధం అనే నిర్ణయం గనుక తీసుకుంటే…ఆ ఏడాది కాలం పూర్తయ్యేసరికి 2019 మార్చి వచ్చేస్తుంది… ఎన్నికలు ముంగిట్లోకి వచ్చి నిలబడతాయి… బహుశా వచ్చే ఏడాది టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్ఆన్‌అకౌంటే ప్రవేశపెట్టే చాన్స్ మాత్రమే ఉంటుందేమో… అంటే ఇక కోమటిరెడ్డి పునర్దర్శనం వచ్చే అసెంబ్లీలోనేనా..? అదీ తను మళ్లీ అసెంబ్లీకి పోటీ చేస్తే..? గెలిస్తే…?! అన్న అంశం పైనా  వాదాలనాలు, రచ్చబండ కబుర్లు జోరుగా సాగుతున్నాయి. మరి గులాబీ బాస్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచుడాలి మళ్ల. 

 
 

Related Posts