YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కరణం బలరాంకు నోటీసులు

కరణం బలరాంకు నోటీసులు

కరణం బలరాంకు నోటీసులు
విజయవాడ, సెప్టెంబర్ 14,
టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చీరాల నుంచి బలరాం ఎన్నిక చెల్లదంటూ ఆయన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం నోటీసులిచ్చింది. బలరాం ఎన్నికల అఫిడవిట్‌లో అనేక వాస్తవాలు దాచిపెట్టారని, ఈ విషయం అప్పటి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమంచి పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల చీరాల నుంచి బలరాం ఎన్నిక చెల్లదని, తాను ఎన్నికైనట్లు ప్రకటించాలని కోర్టును ఆశ్రయించారు.ఆమంచి పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. బలరాం తన నామినేషన్‌లో భార్య పేరు కరణం సరస్వతిగా పేర్కొన్నారని, ఆయన మరో భార్య ప్రసూన, కుమార్తెల విషయం ప్రస్తావించలేదని ఆమంచి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం ఎమ్మెల్యే కరణం బలరాంకు నోటీసులు జారీ చేసింది. రిటర్నింగ్ అధికారికి కూడా నోటీసులిచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. తెలుగుదేశం నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. కరణం బలరాం తన ఎన్నికల అఫిడవిట్ లో పలు అంశాలను దాచిపెట్టారనీ, తప్పుడు అఫిడవిట్ ను సమర్పించాలని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కొన్నిరోజుల క్రితం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.  తన నామినేషన్‌లో భార్య పేరును కరణం సరస్వతిగా బలరాం పేర్కొన్నారని, అయితే ఆయనకున్న మరో భార్య ప్రసూన, కుమార్తె గురించి నామినేషన్‌లో ప్రస్తావించలేదని కోర్టుకు విన్నవించారు.కాబట్టి ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవి.. కరణం బలరాంతో పాటు అప్పటి చీరాల ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీచేశారు. ఈ కేసులో 3 వారాల్లోగా స్పందనను తెలియజేయాలని ఆదేశించారు. అనంతరం విచారణను 3 వారాలకు వాయిదా వేశారు.గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు పలువురు కోర్టులను ఆశ్రయించారు. చీరాల ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి, గుంటూరు ఎంపీ అభ్యర్ధి మోదుగుల వేణుగోపాలరెడ్డి సహా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Related Posts